Best Selling Split AC : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ సెల్లింగ్ స్ప్లిట్ ఏసీలు.. దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి!
Best Selling Split AC : కొత్త ఏసీ కావాలా? అనేక ఏసీల బ్రాండ్లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఉన్నాయి. వోల్టాస్ 2024 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీని ఎలా కొనుగోలు చేయాలంటే?

Best Selling Split AC
Best Selling Split AC : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? సమ్మర్ వచ్చేసింది.. మార్చి నెల మధ్యకు వచ్చేశాం.. ఎండలు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఉష్టోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇంట్లో కాసేపు ఫ్యాన్, ఏసీలు, కూలర్లు లేకుండానే ఉండలేని పరిస్థితి.
చాలామంది మార్కెట్లో కొత్త ఏసీల కోసం చూస్తున్నారు. తక్కువ ధరలో ఏసీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా తక్కువ ధరలో కొత్త ఏసీ కొనాలని చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రస్తుతానికి అత్యంత అమ్ముడయ్యే స్ప్లిట్ ఏసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానంగా ఏసీలను అందించే పలు బ్రాండ్లలో ఎల్‌జీ, శాంసంగ్, క్యారియర్ వంటి అద్భుతమైన ఏసీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. ఎక్కువకాలం మన్నికను అందించేలా ఉన్నాయి. ఇంట్లో గాలిని క్షణాల్లో క్లీన్ చేసే ఏసీలు కూడా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా కూల్‌గా ఉంచుతాయి.
అంతేకాదు.. మీ కరెంట్ బిల్లులు కూడా చాలా తక్కువగా వస్తాయి. వేసవి పూర్తిగా రాకముందే మీకు అద్భుతమైన ఏసీని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. గాలి నాణ్యత, స్మార్ట్ టెక్ ఫీచర్లను కలిగిన ఏసీలను ఎంచుకోవాలి. మీ బడ్జెట్‌లో తగిన ఏసీని కొనుగోలు చేయడం మంచిది. ఇంతకీ మార్కెట్లో ఏయే బ్రాండ్ల ఏసీలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం..
వోల్టాస్ 2024 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ :
టాటా మార్కెట్లో కొత్త ఏసీలను విక్రయిస్తుందని తెలుసా? టాటా ఏసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వేసవి ప్రారంభంలో ఏ ఏసీ బ్రాండ్ ఏసీలపై భారీ తగ్గింపును అందిస్తుందో తెలుసా? టాటా కంపెనీ ఎయిర్ కండిషనర్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. టాటా ఏసీల గురించి తెలియకపోవచ్చు. టాటా కంపెనీ ఏసీలు వోల్టాస్ బ్రాండ్ పేరుతో మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. వేసవి ప్రారంభంలో టాటా కంపెనీ ఈ ఏసీలపై 45 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ వోల్టాస్ 2024 1 టన్ 3 స్టార్ :
వేసవిలో తక్కువ బడ్జెట్‌లో కొత్త ఏసీని కొనాలని చూస్తుంటే.. 1 టన్ను 3 స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 45 శాతం తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత ఈ 3-స్టార్ రేటెడ్ వోల్టాస్ ఏసీ ధర రూ. 30,990 (MRP రూ. 56వేలు)కు వస్తుంది. అదనంగా, మీరు ఈ ఏసీపై ఏడాది వారంటీ, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.
శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ శాంసంగ్ స్ప్లిట్ ఏసీని స్టెబిలైజర్ లేకుండా ఉపయోగించవచ్చు. స్ప్లిట్ ఏసీ 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగింది. ఏడాది పొడవునా 749 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. తద్వారా చాలా డబ్బు ఆదా అవుతుంది. రాగి కండెన్సర్ కాయిల్ అద్భుతమైన కూలింగ్ అందిస్తుంది. ఈ ఏసీ మెయింట్‌నెన్స్ కూడా చాలా తక్కువ. ఫాస్ట్ కూలింగ్ డ్యూరాఫిన్ అల్ట్రా, ట్రిపుల్ ప్రొటెక్షన్ ప్లస్, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వంటి ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది.
ఎల్‌జీ 1.5 టన్ 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ ఎల్‌జీ కంపెనీ కూలింగ్ మోడ్‌తో ఏఐ కన్వర్టిబుల్ 6 ఇన్ 1 స్ప్లిట్ ఏసీ. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. హీట్ బట్టి పవర్ అడ్జెస్ట్ చేస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఏడాది పొడవునా 852 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. స్వచ్ఛమైన కాపర్ పదార్థంతో తయారైన కండెన్సర్ కాయిల్‌ను కలిగి ఉంది. ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ లేయర్ కూడా ఉంది. ఏసీ మన్నికను పెంచుతుంది.