Motorola Edge 60 Pro : ఫీచర్లు అంటే ఇలా ఉండాలి.. కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే భారీ అంచనాలు..!
Motorola Edge 60 Pro : భారత మార్కెట్లోకి అతి త్వరలో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేస్తోంది. ఈ ప్రీమియం ఫోన్ లాంచ్ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫోన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Motorola Edge 60 Pro
Motorola Edge 60 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తు్న్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్లతో మళ్లీ రాబోతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో మోటోరోలా మరోసారి ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త ఫోన్లను అందించేందుకు రెడీ అవుతోంది. కంపెనీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ లాంచ్ కాక ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫోన్ కీలక ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి.
Read Also : Samsung Galaxy S24 Plus : హోలీ బంపర్ ఆఫర్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ 5జీ ఫోన్ కేవలం రూ. 22వేలకే.. డోంట్ మిస్
మీరు కూడా ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? ప్రస్తుతం మీరు కొద్దిరోజులు వేచి ఉండాలి. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఇంకా భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. దీని ప్రకారం.. కంపెనీ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే, మోటోరోలా ఇంకా అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు.
డిస్‌ప్లే, డిజైన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 6.79-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లేలో కంటెంట్‌ను వీక్షించడం అద్భుతంగా అనిపించేలా ఉంటుంది. అంతేకాదు.. స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన వ్యూ యాంగిల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెప్పవచ్చు.
పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 చిప్‌సెట్ అందిస్తోంది. చాలా పవర్‌ఫుల్ ఫోన్ అని చెప్పవచ్చు. అలాగే, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌ని పొందే అవకాశం ఉంది. తద్వారా మల్టీ టాస్కింగ్, గేమింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కెమెరా సెటప్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోటోగ్రఫీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 50ఎంపీ ఉంటుంది. అదే సమయంలో, ఫ్రంట్ సైడ్ 60ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 4600mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా దిగిపోదు. కొన్ని నిమిషాల్లోనే ఛార్జింగ్ కూడా ఫుల్ అవుతుంది.
ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఫోన్ ధర దాదాపు రూ.59,990 ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, లాంచ్ సమయంలో కంపెనీ అధికారిక ధరను వెల్లడించే అవకాశం ఉంది. ఆసక్తిగల వినియోగదారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ మోటోరోలా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.