Samsung Galaxy S24 Plus : హోలీ బంపర్ ఆఫర్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ 5జీ ఫోన్ కేవలం రూ. 22వేలకే.. డోంట్ మిస్

Samsung Galaxy S24 Plus : శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అత్యంత ఖరీదైన ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో కేవలం రూ. 22వేలకు లభ్యమవుతుంది.

Samsung Galaxy S24 Plus : హోలీ బంపర్ ఆఫర్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ 5జీ ఫోన్ కేవలం రూ. 22వేలకే.. డోంట్ మిస్

Samsung Galaxy S24 Plus

Updated On : March 13, 2025 / 12:45 PM IST

Samsung Galaxy S24 Plus : కొత్త ఫోన్ కొంటున్నారా? హోలీ పండగ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది.

అత్యంత ఖరీదైన ఈ స్మార్ట్‌ఫోన్‌లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారులు ఈ ప్రీమియం సిరీస్‌ను కేవలం రూ.22 వేల ధరలో కొనుగోలు చేయొచ్చు. మీరు శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Sundar Pichai : సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ ఎలా అయ్యాడు..? సాధారణ జీవితం నుంచి ఆల్ఫాబెట్ వరకు.. ఆయన సక్సెస్ సీక్రెట్ ఇదే..!

శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్‌పై హోలీ డిస్కౌంట్ :
హోలీ పండుగ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుదారుల కోసం శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ.99,999 అంటే.. దాదాపు లక్ష ఖరీదు ఉండగా, అంతకన్నా చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించి 43 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు కేవలం రూ.56,999కే ఇంటికి కొనితెచ్చుకోవచ్చు. అంతేకాదు.. మరెన్నో డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్ :
శాంసంగ్ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసే వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనంగా, మీరు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ని వాడితే మీరు రూ.750 వరకు సేవ్ చేయొచ్చు.

తక్కువ బడ్జెట్‌‌లో కావాలంటే.. రూ.9,500 నెలవారీ ఈఎంఐ పేమెంట్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై రూ.52,250 వరకు ఆదా చేసుకోవచ్చు.. ఉదాహరణకు, మీ పాత ఫోన్ వాల్యూ రూ.35వేలు అయితే, గెలాక్సీ S24 ప్లస్‌ను కేవలం రూ.22వేలకే కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌ కలిగి ఉంది. వాటర్, డస్ట్ నిరోధకతకు IP68 రేటింగ్‌తో వస్తుంది. అద్భుతమైన 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆకర్షణీయమైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫ్యూచర్ అప్‌గ్రేడ్‌ల ఆప్షన్లతో Android 14పై రన్ అవుతుంది.

Read Also : Nothing Phone 3a Series : నథింగ్ ఫోన్లు భలే ఉన్నాయి భయ్యా.. రెండు ఫోన్లపై రూ. 5వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం శాంసంగ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో పాటు 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఇందులో 50+10+12MP సెన్సార్లు ఉంటాయి. 12ఎంపీ కెమెరా మాత్రం సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా అందించారు. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీ 4900mAh బ్యాటరీని అమర్చారు.