Nothing Phone 3a Series : నథింగ్ ఫోన్లు భలే ఉన్నాయి భయ్యా.. రెండు ఫోన్లపై రూ. 5వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Nothing Phone 3a Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇది మీకోసమే.. నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్ మోడళ్లపై కంపెనీ రూ. 5వేలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 3a Series : నథింగ్ ఫోన్లు భలే ఉన్నాయి భయ్యా.. రెండు ఫోన్లపై రూ. 5వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Nothing Phone 3a Series

Updated On : March 12, 2025 / 6:09 PM IST

Nothing Phone 3a Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో సిరీస్ మోడల్స్. ఈ రెండు ఫోన్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాదిలో నథింగ్ ఫోన్ 2a, నథింగ్ ఫోన్ 2a ప్లస్‌ మాదిరిగానే లాంచ్ అయ్యాయి.

ఈ కొత్త మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 ఎస్ఓసీలు పవర్‌ఫుల్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లు, ఆండ్రాయిడ్ 15-ఆధారిత నథింగ్‌OS 3.1, మెరుగైన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగిన డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌తో రూపొందించింది. ఆసక్తిగల కొనుగోలుదారుల ధర, ఆఫర్‌లు, లభ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.

Read Also : Oppo F29 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో F29 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

భారత్ ధర ఎంతంటే? :
నథింగ్ ఫోన్ 3ఎ ధర 8జీబీ+ 128జీబీ మోడల్‌కు రూ.24,999 నుంచి ప్రారంభమై 8జీబీ + 256జీబీ వెర్షన్‌కు రూ.26,999 వరకు ఉంటుంది. నథింగ్ ప్రో వేరియంట్ 8జీబీ + 128జీబీ ఆప్షన్‌కు రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. హై స్టోరేజ్ మోడల్‌ల ధర 8జీబీ+ 256జీబీకి రూ.31,999, 12జీబీ+ 256జీబీ కాన్ఫిగరేషన్‌కు రూ.33,999కు అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా నథింగ్ ఫోన్ 3a, ప్రో బేస్ వేరియంట్‌లు వరుసగా రూ.19,999, రూ.24,999 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.

ఈ డీల్‌లో రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ట్రేడ్-ఇన్‌తో పాటు అదనంగా రూ.3వేలు తగ్గింపు కూడా పొందవచ్చు. నథింగ్ ఫోన్ 3a ప్రో వెర్షన్ బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే, బేస్ మోడల్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో రెండూ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేలు, 3వేల నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశం, ప్రొటెక్ట్ పాండా గ్లాస్‌ కలిగి ఉన్నాయి. అంతేకాదు.. స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 ఎస్ఓసీల ద్వారా పవర్ పొందుతాయి. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తాయి. నథింగ్ OS 3.1తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. :
నథింగ్ ఫోన్ 3a ప్రోలో OIS, EIS సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్, 6x ఇన్-సెన్సార్, 60x డిజిటల్ జూమ్ 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

Read Also : Sundar Pichai : సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ ఎలా అయ్యాడు..? సాధారణ జీవితం నుంచి ఆల్ఫాబెట్ వరకు.. ఆయన సక్సెస్ సీక్రెట్ ఇదే..!

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ప్రామాణిక ఫోన్ 3aలో 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు 2x ఆప్టికల్, 4x ఇన్-సెన్సార్, 30x డిజిటల్ జూమ్‌ను అందించే 50ఎంపీ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.

ఈ నథింగ్ ఫోన్లు కూడా 10 కొత్త రింగ్‌టోన్‌లు, నోటిఫికేషన్ సౌండ్‌ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తాయి. ప్రతి స్మార్ట్‌ఫోన్ 50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు 5,000mAh బ్యాటరీ సపోర్టుతో వస్తాయి. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్‌ IP64 రేటింగ్‌తో వస్తాయి. అదనపు సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లతో వస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, USB టైప్-సి సపోర్టు ఇస్తాయి.