Oppo F29 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో F29 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Oppo F29 Launch : ఒప్పో సరికొత్త ఫోన్ తీసుకొస్తోంది. గత ఏడాదిలో ఒప్పో F27 సిరీస్ తర్వాత, మార్చి 20న భారత మార్కెట్లో ఒప్పో F29 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

Oppo F29 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో F29 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Oppo F29 Launch

Updated On : March 12, 2025 / 5:28 PM IST

Oppo F29 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. గత ఏడాదిలో ఒప్పో F27 సిరీస్ లాంచ్ తర్వాత మార్చి 20న భారత మార్కెట్లో ఒప్పో F29 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఒప్పో ఫోన్ అనేక అప్‌గ్రేడ్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ కాలం మన్నిక, పర్ఫార్మెన్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రాబోయే ఒప్పో ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : SIP Secret Forumla : మీ డబ్బులు డబుల్ అయ్యే SIP సీక్రెట్ ఫార్మూలా.. కేవలం రూ. 10వేలతో రూ. 2 కోట్లు సంపాదించవచ్చు..!

ఒప్పో అందించే ఫీచర్లలో ఒకటి 360-డిగ్రీల ఆర్మర్ బాడీ.. భారత మార్కెట్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించింది. ఈ ఫోన్ 14 కన్నా ఎక్కువ మిలిటరీ-గ్రేడ్ టెస్టులు జరిపినట్టు కంపెనీ చెబుతోంది. అందుకే అంత దృఢంగా ఉంటుందని, IP66, IP68, IP69 రేటింగ్‌లతో ధృవీకరించినట్టు చెబుతోంది. భారత మార్కెట్లో SGS పరీక్షల ప్రకారం.. దుమ్ము, నీటికి అధిక నిరోధకతను కలిగిస్తాయని తేలింది.

డిజైన్ పరంగా పరిశీలిస్తే.. :
ఒప్పో F29 సిరీస్ అద్భుతమైనది. చాలా తేలికైనది కూడా. దాదాపు 180 గ్రాముల బరువు, కేవలం 7.55ఎమ్ఎమ్ మందం కలిగి ఉంటుంది. హుడ్ కింద, 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇచ్చే పెద్ద 6,000mAh బ్యాటరీ ఉంది.

ఒప్పో 300 శాతం నెట్‌వర్క్ బూస్ట్‌ను ప్రకటించింది. నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఒప్పో ఫోన్‌లో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని లీకులు సూచిస్తున్నాయి.

Read Also : Amazon Sale 2025 : కొత్త ఏసీ కావాలా? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ స్ప్లిట్ ఏసీలు కొనేసుకోండి!

ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఒప్పో F29 ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 2ఎంపీ మోనోక్రోమ్ లెన్స్‌తో వస్తుందని అంచనా.

ఫ్రంట్ సైడ్ యూజర్లు 16ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ లేదా 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో రావచ్చు. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ఒప్పో F29 ఫోన్ ధర రూ. 25వేల నుంచి రూ. 30వేల మధ్య తగ్గుతుంది.