SIP Secret Forumla : మీ డబ్బులు డబుల్ అయ్యే SIP సీక్రెట్ ఫార్మూలా.. కేవలం రూ. 10వేలతో రూ. 2 కోట్లు సంపాదించవచ్చు..!
SIP Secret Forumla : ఎస్ఐపీలో పెట్టుబడి పెడుతున్నారా? అయితే, ముందుగా ఎస్ఐపీ అందించే ఈ సీక్రెట్ ఫార్మూలా గురించి తెలుసుకోండి. మీరు నెలకు రూ. 10వేలు చొప్పున పెట్టుబడి పెడితే కొన్నేళ్లలో రూ. 2 కోట్లు సంపాదించుకోవచ్చు.

SIP Secret Forumla
SIP Secret Forumla : మీరు SIPలో పెట్టబడి పెడదామని అనుకుంటున్నారా? అయితే, మీ డబ్బులు డబుల్ కావాలంటే ముందుగా ఎస్ఐపీ సీక్రెట్ ఫార్మూలా గురించి తప్పక తెలుసుకోవాలి. మీరు ఎస్ఐపీని ఇలా చేయడం మొదలుపెడితే దీర్ఘకాలంలో మీ డబ్బులు ఊహించినంతగా రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లలో SIPకి భారీ డిమాండ్ ఉంది. గత ఫిబ్రవరి 2025లో SIP పెట్టుబడి రికార్డు స్థాయిలో రూ.26వేల కోట్లకు చేరుకుంది.
మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడిని పెట్టవచ్చు. SIP ప్రతి నెల, వారం లేదా ప్రతిరోజూ చేయవచ్చు. దీర్ఘకాలిక SIPలో పెట్టుబడిదారులు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
ఇందులో మరో ఫెసిలిటీ కూడా ఉంది. అదే.. టాప్-అప్ SIP. అంటే.. మీరు ప్రతి ఏడాది నెలవారీ SIP ద్వారా స్థిర మొత్తాన్ని చేర్చుకుంటూ పోవాలి అనమాట. అప్పుడు మీ కార్పస్ రెట్టింపు అవుతుంది. మీరు కూడా మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావిస్తే.. SIP అందించే ఈ సీక్రెట్ ఫార్మూలాను తప్పక పాటించాలి. అప్పుడే మీరు అద్భుతమైన లాభాలను పొందవచ్చు.
టాప్-అప్ SIP ఎలా వేయాలి? :
టాప్-అప్ SIP అంటే.. మీరు నెలకు రూ. 10వేల SIP ఆప్షన్ ఎంచుకున్నట్టే. ప్రతి ఏడాదిలో మీ జీతం పెరిగేకొద్దీ, మీరు ప్రతి ఏడాది అదే నిష్పత్తిలో SIPలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు పూర్తి లెక్కలతో తెలుసుకుందాం.
సిప్ | నెలవారీ SIP (రూ.) | ఎంత వ్యవధి | అంచనా రాబడి | మొత్తం పెట్టుబడి | 20 ఏళ్ల తర్వాత SIP విలువ | లాభం (అంచనా) |
---|---|---|---|---|---|---|
రెగ్యులర్ SIP | రూ. 10వేలు | 20 ఏళ్లు | 12శాతం | రూ. 24 లక్షలు | రూ. 99.91 లక్షలు (రూ. 1 కోటి) | రూ.75.91 లక్షలు |
టాప్-అప్ SIP | రూ. 10వేలు (10శాతం వార్షిక టాప్-అప్) | 20 ఏళ్లు | 12శాతం | రూ. 68.73 లక్షలు | రూ. 1.99 కోట్లు (2 కోట్లు) | రూ. 1.30 కోట్లు |
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ SIPతో పాటు టాప్ అప్ SIP ఫార్ములాతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. వాస్తవానికి, టాప్-అప్ సిప్ అనేది మీరు ప్రతి ఏడాదిలో మీ రెగ్యులర్ SIPకి కొంత మొత్తాన్ని పెట్టుబడిని చేర్చడమే.
ఉదాహరణకు.. ప్రతి ఏడాదిలో మీ జీతం పెరిగేకొద్దీ.. మీరు ప్రతి ఏడాది అదే నిష్పత్తిలో SIPలో కొంత మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెడతారు. టాప్-అప్ సిప్ ద్వారా మీరు మీ పెట్టుబడి లక్ష్యాలను త్వరగా సులభంగా సాధించవచ్చు.