8th Pay Commission : కీలక అప్‌డేట్.. పెన్షనర్లకు పండగే.. అదేగానీ జరిగితే, రూ. 2 లక్షల పైనే పెన్షన్.. పూర్తి లెక్కలు మీకోసం..!
8th Pay Commission : 7వ వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పెన్షన్ భారీగా పెరిగాయి. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90గా నిర్ణయిస్తే మాత్రం పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలుగనుంది.

8th Pay Commission Calculator
8th Pay Commission Calculator : 8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లలో కొత్త వేతన సంఘం గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. రాబోయే 8వ వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లకు అతిపెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. నివేదికలను విశ్వసిస్తే.. కొత్త పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90గా నిర్ణయించవచ్చు.
ఇలాంటి పరిస్థితిలో పెన్షనర్లు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే.. పెన్షనర్ల పెన్షన్ నేరుగా 90శాతం పెరగవచ్చు. అదేగానీ జరిగితే మాత్రం పెన్షనర్ల పెన్షన్ రూ. 2 లక్షల కన్నా ఎక్కువగా ఉండవచ్చు. అసలు పెన్షన్ రూ. 2 లక్షలు ఎలా దాటుతుందో పూర్తి లెక్కలతో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.90 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో బెనిఫిట్స్ ఏంటి? :
7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పెన్షన్‌లో భారీ పెరుగుదల కనిపించింది. 8వ వేతన సంఘంలో ఇప్పుడు 1.90గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే పెన్షనర్లకు అంతకన్నా భారీ ప్రయోజనం కలుగుతుంది.
8వ వేతన సంఘంలో భవిష్యత్ పెన్షన్ లెక్కింపు :
7వ వేతన సంఘంలో పెన్షన్ (రూ.) x (ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90ని వర్తింపు జేస్తే)
8వ వేతన సంఘంలో పెన్షన్ (రూ.)
రూ. 9వేల (కనీస పెన్షన్) : రూ. 17,100
రూ. 1,25,000 (గరిష్ట పెన్షన్) : రూ. 2,37,500
పెన్షన్ ఎలా నిర్ణయిస్తారంటే? :
ప్రభుత్వ పెన్షన్ లెక్కింపు అనేది ఉద్యోగి కనీస జీతం, వర్తించే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, 7వ వేతన సంఘం ప్రకారం.. పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు, వారి కనీస, గరిష్ట పెన్షన్ ఈ కింది విధంగా నిర్ణయిస్తారు.
7వ వేతన సంఘం పెన్షన్ ప్రకారం.. :
1.90 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
కనీస పెన్షన్ : రూ 9వేలు× 1.90 = రూ. 17,100
గరిష్ట పెన్షన్ : రూ. 1,25,000 × 1.90 = రూ. 2,37,500
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటి? :
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఉద్యోగి, సంస్థలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.80కి పెంచాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా పెన్షనర్లు, ఉద్యోగులు మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. 2025లో ప్రభుత్వం 8వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 అయితే, లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది.
పెన్షన్ ఎలా నిర్ణయిస్తారంటే? :
ప్రభుత్వ పెన్షన్‌ను కనీసం జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా లెక్కిస్తారు.
– 7వ వేతన సంఘంలో కనీస పెన్షన్ నెలకు రూ. 9,000గా నిర్ణయించారు.
– ఉద్యోగి కనీస జీతంలో 50శాతం మాత్రమే పెన్షన్‌గా అందుతుంది.
– ప్రస్తుతం గరిష్ట పెన్షన్ నెలకు రూ. 1,25,000 7వ వేతన సంఘం ప్రకారం నిర్ణయించారు.
– ఇప్పుడు 8వ వేతన సంఘంలో అది రూ. 2 లక్షల కన్నా ఎక్కువగా ఉండవచ్చు.