BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. రోజుకు 1జీబీ డేటా, 6 నెలలు ఎంజాయ్ చేయొచ్చు..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ GP-2 కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫ్రీ కాలింగ్, 1జీబీ రోజువారీ డేటాను సరసమైన ధరకు అందిస్తోంది.

BSNL Recharge Plan
BSNL Recharge Plan : ప్రముఖ దేశీయ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. టారిఫ్ పెంపుతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను వేగంగా కోల్పోయింది. ప్రతి నెలా లక్షలాది మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది.
ట్రాయ్ డేటా ప్రకారం.. టెలికాం ఆపరేటర్ 2024 నవంబర్, డిసెంబర్‌లలో సుమారు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. ఇతర టెలికం పోటీ నెట్‌వర్క్‌లకు సబ్‌స్క్రైబర్లు మారిపోతున్న సందర్భంలో బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఈ కస్టమర్లను నిలుపుకోవడంపైనే దృష్టి సారించింది.
కంపెనీ తన యూజర్ల కోసం ప్రత్యేకంగా కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 750 చెల్లిస్తే చాలు.. 6 నెలల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా, BSNL GP-2 కేటగిరీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. 7 రోజులకు పైగా రీఛార్జ్ చేయని యూజర్లు మాత్రమే రాబోయే 165 రోజుల్లో ఈ ప్లాన్‌ను వినియోగించుకోగలరు.
బెనిఫిట్స్ విషయానికి వస్తే.. :
ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 1GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా లిమిట్ చేరుకున్న తర్వాత స్పీడ్ 40Kbpsకి పడిపోతుంది. మొత్తంమీద, ఈ ప్లాన్ మొత్తం 180GB డేటాను అందిస్తుంది. 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దేశంలో ఇతర ఏ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ కూడా ఇలాంటి ప్లాన్‌ను అందించలేదు.
బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఈ కొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఇతర నెట్‌వర్క్‌లకు మారకుండా ఉండేందుకు అద్భుతమైన డీల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గత 90 రోజుల్లో 71వేలకు పైగా సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ సిమ్ కార్డులు మోసపూరిత పద్ధతుల ద్వారా పొందినట్టు గుర్తించారు.
ప్రధానంగా స్కామ్‌ల కోసం ఈ సిమ్ కార్డులను ఉపయోగించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో ఎక్కువ భాగం మోసగాళ్లచే ఫేక్ ఐడీకార్డులతో రిజిస్టర్ అయినట్టుగా గుర్తించారు. పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లను ఆసరాగా చేసుకుని చాలామంది సైబర్ మోసగాళ్లు చట్టవిరుద్ధంగా సిమ్ కార్డులను పొందారు. ఈ సిమ్ కార్డులను పొందేందుకు ఫేక్ ఐడెటింటీ కార్డులను ఉపయోగించారని, కోట్లాది రూపాయలను కాజేశారని అధికారులు వివరించారు.