iPhone 17 Pro Series : ఆపిల్ ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్.. లిక్విడ్ కూలింగ్‌తో ఐఫోన్ 17ప్రో, ప్రో మ్యాక్స్ వచ్చేస్తున్నాయి.. ఎంత వాడినా కూలింగ్ అవుతాయట..!
iPhone 17 Pro Series : ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 17 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రెండు వేరియంట్లు లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో నివేదికలు సూచిస్తున్నాయి.

iPhone 17 Pro Series
iPhone 17 Pro Series : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తు్న్నారా? ప్రస్తుత ఐఫోన్ 16 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఐఫోన్ 17 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ ఐఫోన్ 17ప్రో సిరీస్ డెవలప్ స్టేజీలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ ఐఫోన్‌లలో థర్మల్ పవర్ వంటి కీలకమైన కొత్త ఫీచర్ లిక్విడ్ కూలింగ్ ఉండవచ్చని రుమర్లు వినిపించాయి.
వాస్తవానికి, ఐఫోన్ 16 సిరీస్‌లో ఈ కూలింగ్ ఫీచర్ అందుబాటులో లేదు. హీటింగ్ ప్రెజర్ సమయంలో కూడా ఐఫోన్‌ను కూల్‌గా ఉంచడంలో సాయపడుతుంది. ఐఫోన్ 17 సిరీస్‌లో ఈ టెక్నాలజీ లభ్యత కచ్చితమైన సమాచారం అందులో లేదు. కొత్త నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లకు మాత్రమే ఈ కూలింగ్ ఫీచర్ రావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.
ఐఫోన్ 17 ప్రో మోడళ్లలో లిక్విడ్ కూలింగ్ :
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో ప్రకారం.. టిప్‌స్టర్ ఇన్‌స్టంట్ డిజిటల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ హీట్ వెదజల్లడానికి ‘స్టీమ్ కేవిటీ’ని ఉపయోగిస్తాయని సూచించింది. తప్పనిసరిగా స్టీమ్ రూంను కలిగి ఉంటుందని తెలిపింది. టిప్‌స్టర్ ప్రకారం.. రెండు ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ మోడల్‌లు ఈ టెక్నాలజీతో A19 ప్రో SoC థర్మల్ మేనేజ్‌మెంట్‌ను అందించనున్నాయి.
దీని కారణంగా ఐఫోన్లకు మరింత పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. హై-లోడ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరుస్తుందని అంచనా. ముఖ్యంగా, ఆపిల్ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ మోడల్‌లు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ హీట్ మెనేజ్‌మెంట్ కోసం గ్రాఫేన్ షీట్‌తో అమర్చి ఉంటాయి. గతంలో అనేక మంది టిప్‌స్టర్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
మొదట టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అనలిస్ట్ మింగ్-చి కువో కూడా చెప్పారు. అయితే, స్టీమ్ చాంబర్ హీట్ సింక్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు మాత్రమే పరిమితమని అంటున్నారు. ఐఫోన్ సమాచారం లీక్ తర్వాత చైనీస్ సంస్థ మైడ్రైవర్స్ కువో వాదనలను తీవ్రంగా ఖండించింది.
అన్ని ఐఫోన్ 17 మోడళ్లు లిక్విడ్ కూలింగ్ వస్తాయని పేర్కొంది. అయితే, ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయ్యేందుకు ఇంకా చాలా నెలలు సమయం ఉంది. ఈ లీక్‌లను పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి మరిన్ని వివరాలు లాంచ్ దగ్గర పడే కొద్ది రివీల్ అయ్యే అవకాశం ఉంది.