SIM Card Block : ఏపీ, తెలంగాణలో 70వేలకు పైగా సిమ్ కార్డులు బ్లాక్.. వినియోగదారులు ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ప్రభుత్వం హెచ్చరిక!
SIM Card Block : ఏపీ, తెలంగాణలో 70వేలకు పైగా సిమ్ కార్డులను బ్లాక్ చేసినట్టు DoT అధికారులు వెల్లడించారు. సిమ్ కార్డుల మోసాల గురించి వినియోగదారులు ఈ తప్పులను అసలు చేయొద్దంటూ సూచనలు చేసింది.

SIM Card Block
SIM Card Block : సిమ్ కార్డు వాడుతున్నారా? మీకు ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి. అన్ని మీ పేరు మీదే ఉన్నాయా? మీకు తెలియకుండా ఎవరైనా మీ పేరుతో సిమ్ కార్డు తీసుకుని వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రస్తుత రోజుల్లో సిమ్ కార్డు మోసాలు భారీగా పెరిగాయి. చాలామంది వినియోగదారులు సిమ్ కార్డు మోసాల బారినపడుతున్నారు.
సిమ్ కార్డులు తమ పేరుతో ఎన్ని ఉన్నాయి అనే విషయం కూడా తెలియని వారు ఉన్నారు. చాలావరకూ ఫేక్ ఐడీలతో సిమ్ కార్డులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు డాట్ అధికారులు. అలాంటి ఫేక్ సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గత 90 రోజుల్లో టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) 71వేల కన్నా ఎక్కువ సిమ్ కార్డులను బ్లాక్ చేసింది.
ఈ సిమ్ కార్డులను మోసపూరిత మార్గాల ద్వారా తీసుకున్నారని గుర్తించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. చాలా వరకు మోసగాళ్ళు తప్పుడు గుర్తింపులతో సిమ్ కార్డులను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సైబర్ మోసగాళ్లు పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లను ఉపయోగించి అక్రమంగా సిమ్ కార్డులను పొందుతున్నారు. ఈ కార్డులను భద్రపరచడానికి ఫేక్ ఐడీ కార్డులను ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు.
అంతేకాదు.. వినియోగదారులను నమ్మించి కోట్లాది రూపాయలను మోసం చేశారని వెల్లడించారు. సంచార్ సాథీ పోర్టల్, వెబ్‌సైట్ ద్వారా లేదా 1930కి కాల్ చేయడం ద్వారా సిమ్ సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
అధికారుల ప్రకారం.. బాధితులు ముందుకు రాకపోతే మోసగాళ్ళు తమ మోసపూరిత వ్యూహాలను అలానే కొనసాగిస్తారు. ఇలాంటి మోసాలను నివారించేందుకు అవసరమైన చర్యలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.
సిమ్ మోసాలను ఇలా ట్రాక్ చేయొచ్చు :
సిమ్ మోసాన్ని ట్రాక్ చేయడం లేదా పరిష్కరించేందుకు ఉపయోగించే వివిధ టూల్స్ గురించి (DoT) అధికారులు ప్రస్తావించారు. ఇలాంటి టూల్స్‌లో (ASTR) అనే టూల్ ఒకటి. టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ ఏఐ, ఫేస్ ఐడెంటిటీ ఆధారితంగా ఉంటుంది.
ఈ సిస్టమ్ సిమ్ కార్డ్ హోల్డర్ల రికార్డులను స్టోర్ చేస్తుంది. వివిధ అడ్రస్‌లు, పేర్లతో ఒక వ్యక్తి పొందిన మల్టీ సిమ్ కార్డులను గుర్తించగలదు. ఈ టెక్నాలజీ కారణంగా అనేక మోసపూరిత సిమ్‌లు డిస్‌కనెక్ట్ అవుతాయి.
DoT ప్రకారం.. సిమ్ కార్డులను జారీ చేసే ముందు సరైన ధృవీకరణ కలిగి ఉండటం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (TSP) బాధ్యత. ఒకవేళ సిమ్ వెరిఫికేషన్ విఫలమైతే.. లైసెన్సర్, లైసెన్స్ (TSP) మధ్య నిర్దిష్ట లైసెన్సింగ్ చర్యలు తీసుకునే అధికారం డాట్ అధికారులకు ఉంటుంది.
సిమ్ కార్డులను ట్రాన్స్‌ఫర్ చేయొద్దు :
వినియోగదారులు తమ సిమ్ కార్డులను ట్రాన్స్‌ఫర్ చేయొద్దు. తమ పేరుతో సిమ్ పొందిన వ్యక్తికి మాత్రమే పూర్తిగా బాధ్యత వహిస్తారని అధికారులు హెచ్చరించారు. అక్రమంగా సిమ్ కార్డులను సేకరించడం చట్టరీత్యా నేరమని, దీనికి బెయిల్ కూడా ఉండదని హెచ్చరించారు.
రిలయన్స్ గ్రూప్ డిజిటల్ సర్వీసుల విభాగం అయిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ భారతీయ యూజర్ల కోసం స్టార్‌లింక్ శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను అందించనుంది. ఇప్పటికే, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో దేశంలో స్టార్‌లింక్ సర్వీసులకు అవసరమైన అనుమతులను స్పేస్‌ఎక్స్ పొందనుంది.