ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి భారత మార్కెట్లలో రిలీజ్ అయిన Realme X2 Proలో కొత్త అప్ డేట్ వచ్చేసింది. ప్రత్యేకించి కెమెరా క్వాలిటీ మెరుగుదలపై ఈ కొత్త సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. నవంబర్ OTA అప్‌డేట్ పేరుతో Realme X2 Proపై కెమెరా క్వాలిటీ ఆప్టిమైజేషన్స్ తో పాటు సిస్టమ్ స్టేబులిటీని కూడా మెరుగుపరిచేలా ఉంది. దీంతో స్టేబుల్ OTA ఛానల్ ద్వారా ఇండియాలోని రియల్ మి ఎక్స్2 ప్రో యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది.
ఈ నెల ఆరంభంలో ఇండియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 855+ SoC, 64MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లేతో 90Hz రీప్రెష్ రేట్ ఉంది. 50W ఛార్జింగ్ సపోర్టుతో 4,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. Realme X2 ప్రోలో లేటెస్ట్ అప్ డేట్ బుల్డ్ నెంబర్ (ColorOS 6.1) RMX1931EX_11_A.07 వెర్షన్. ఈ కొత్త అప్ డేట్ ను ఇండియాలో దశలవారీగా రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒకవేళ మీరు Realme X2 Pro యూజర్ అయి ఉండి ఇంకా మీకు ఈ కొత్త Update రాకుంటే మాత్రం.. వచ్చే కొన్ని రోజుల్లో తప్పకుండా ఈ Update అందుకుంటారని కంపెనీ స్పష్టం చేసింది. Realme X2 Pro యూనిట్ పై అందిన అప్‌డేట్ 581MB సైజులో కాస్త పెద్దదిగా పేర్కొంది.
ఇక రియర్ కెమెరాలో నైట్ స్కేప్ మోడల్ ఎనేబుల్ చేస్తే.. రాత్రి సమయంలో కూడా నాణ్యమైన ఫొటోలు తీసుకొవచ్చునని తెలిపింది. కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే.. HDR క్వాలిటీ ఉంది. అదనంగా 90Hz డిస్‌ప్లే లాజిక్ సిస్టమ్ అమర్చారు.
కొత్త అప్‌డేట్ డౌన్‌లోడ్ ఇలా :
మీ Realme X2 Pro స్మార్ట్ ఫోన్లలో ఈ కొత్త అప్ డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ సెట్టింగ్స్ యాప్ సెక్షన్ ఓపెన్ చేయండి. అక్కడ Updates Sectionపై ట్యాప్ చేయండి. లేదంటే.. Realme X2 Pro అధికారిక సపోర్ట పేజీ నుంచి మ్యానువల్ గా Update డౌన్ లోడ్ చేసుకోవచ్చు.