Auto Dealers : పండుగకి ముందు కార్లు, బైక్‌లు కొందామనుకుంటున్నారా? ఇప్పుడే కొనొద్దు.. కొంటే లాస్ అయిపోతారు.. ఎప్పుడు కొనాలంటే?

Auto Dealers : ఓనం, గణేష్ చతుర్థి, దీపావళికి ముందుగానే జీఎస్టీ అమలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని FADA కోరుతోంది.

Auto Dealers : పండుగకి ముందు కార్లు, బైక్‌లు కొందామనుకుంటున్నారా? ఇప్పుడే కొనొద్దు.. కొంటే లాస్ అయిపోతారు.. ఎప్పుడు కొనాలంటే?

Auto dealers warn of festive season

Updated On : August 25, 2025 / 8:01 PM IST

Auto Dealers : అసలే పండగ సీజన్.. కొత్త కారు, బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? జర ఆగండి.. ఈ పండగ సీజన్ లో తక్కువ ధరకే వస్తాయని తొందరపడి కార్లు, బైకులు (Auto Dealers) కొనేయొద్దు. ఇలా చేస్తే భారీగా నష్టపోతారు జాగ్రత్త.. అందులోనూ ఈ సీజన్‌లో దేశీయ ఆటో డీలర్లకు గందరగోళ పరిస్థితి నెలకొంది.

కొత్త GST రేట్ల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో పండుగ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే షోరూమ్‌లు వాహనాలతో నిండిపోయాయి. కానీ, వినియోగదారులు బుక్ చేసుకునేందుకు వెనుకాడతారు. దీనికి అసలు కారణం? జీఎస్టీ అమలు.. ఒకవేళ జీఎస్టీని అమలు చేస్తే వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

పండగ సీజన్ వచ్చిందని ముందుగానే కొనేస్తే ఆ తర్వాత ధరలు తగ్గితే ఎందుకు కొన్నామని కొనుగోలుదారులు కూడా బాధపడాల్సి వస్తుంది. దేశీయ మార్కెట్లో వార్షిక కార్లు, టూవీలర్ అమ్మకాలు ఓనం, గణేష్ చతుర్థి, నవరాత్రి, దీపావళి వంటి పండుగ సమయంలోనే భారీగా జరుగుతాయి.

ఈ డీమాండ్ తీర్చేందుకు డీలర్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ GST కౌన్సిల్ సెప్టెంబర్ 3 నుంచి 4 తేదీలలో మాత్రమే సమావేశం కానుంది. ఈ కొత్త సిస్టమ్ కింద ధర తగ్గింపు ఆశతో కొనుగోలుదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు.

Read Also : Starlink Launch : గుడ్ న్యూస్.. భారత్‌లో ఆ ప్రాంతాలే లక్ష్యంగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు.. ధర, స్పీడ్ ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!

కొత్త జీఎస్టీ రేట్లు, నిర్ణయాల జాప్యంపై వినియోగదారులు సైతం డీలర్లను అడుగుతున్నారు. జీఎస్టీ వ్యవస్థను త్వరగా అమలు చేయకపోతే మొత్తం పండుగ క్యాలెండర్ దీపావళికి మాత్రమే కుదించే ప్రమాదం ఉంది” అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) పేర్కొంది. ఈ అనిశ్చితి సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన సేల్స్ ను వైట్‌వాష్ పీరియడ్ గా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

FADA ఏం చెబుతోంది? :

పండగ సీజన్ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే ముందు కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ముందుగానే నిర్వహించాలని FADA ప్రభుత్వాన్ని కోరింది. డీలర్లకు తిరిగి చెల్లించే వ్యవధిని 30 రోజుల నుంచి 45 రోజులు పొడిగించాలని బ్యాంకులు, NBFCలను ఆదేశించాలని కోరుతంది.

అంతేకాదు.. సెస్‌ను దశలవారీగా తొలగించిన తర్వాత సెస్ క్రెడిట్‌లను ఎలా సర్దుబాటు చేస్తారో స్పష్టం చేయాలని అంటోంది. తద్వారా డీలర్లను ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడేస్తాయని తయారీదారుల నుంచి ఫైనాన్షియర్ల వరకు ప్రయోజకరంగా ఉంటుందని ఆటో డీలర్లు చెబుతున్నారు.

జీఎస్టీ ప్రణాళిక ప్రకారం..:

కేంద్ర ప్రభుత్వం సరళీకృత రెండు-స్లాబ్ విధానాన్ని ప్రతిపాదించింది. అందులో మెరిట్ వస్తువులు, సేవలకు 5 శాతం, స్టాండర్డ్ వస్తువులు, సేవలకు 18 శాతం, అల్ట్రా-లగ్జరీ కార్లు, వస్తువులకు ప్రత్యేక 40 శాతం రేటు వర్తిస్తుంది.

ప్రస్తుతం, ఆటోమొబైల్స్ 28 శాతం టాప్ జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. వెహికల్ టైప్ బట్టి 1-22 శాతం అదనపు సెస్ ఉంటుంది. అంటే మొత్తం పన్ను భారం చిన్న కార్లకు 29 శాతం నుంచి SUVలకు దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే 5 శాతం GST రేటును భరిస్తున్నాయి.

ఈ క్రమంలో FADA సంస్కరణలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ సమయపరమైన సమస్యలను పరిష్కరించకపోతే డిమాండ్ గరిష్ట స్థాయికి చేరితే ఈ మార్పు డీలర్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తుంది.

పండుగ సెంటిమెంట్‌ను కాపాడేందుకు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా డీలర్లు, OEMలు, కాంపోనెంట్ తయారీదారులు, ఫైనాన్షియర్‌లకు ప్రయోజనకరంగా కూడా ఉంటుందని సూచిస్తోంది.