Redmi Note 14 : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ రెడ్‌మి ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

Redmi Note 14 : రెడ్‌మి అభిమానులకు పండగే.. రెడ్‌మి నోట్ 14 ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 8వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Redmi Note 14 : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ రెడ్‌మి ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

Redmi Note 14

Updated On : June 3, 2025 / 1:00 PM IST

Redmi Note 14 : అతి తక్కువ ధరకే రెడ్‌మి ఫోన్ కొనేసుకోండి. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే (Redmi Note 14) ఇదే బెస్ట్ డీల్.. అమెజాన్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. గత డిసెంబర్‌లో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 14 ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లతో లభ్యమవుతుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 11వేలకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. నెలకు కేవలం రూ. 5వేల పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు..!

రెడ్‌మి నోట్ 14 డిస్కౌంట్ (Redmi Note 14) :
6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రెడ్‌మి నోట్ 14 బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉండేది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లకు అమెజాన్ రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయాలంటే ప్లాట్‌ఫామ్‌లో రూ.16,149 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5వేలు సేవ్ చేస్తే.. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కేవలం రూ.10,999 చెల్లించాలి. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 14 స్పెసిఫికేషన్లు (Redmi Note 14) :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6GB లేదా 8GB ర్యామ్ ఆప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 128GB, 256GB వేరియంట్‌లు ఉన్నాయి.

ఫోన్ బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాతో మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది.

Read Also : Financial Tips : ఈ నెల జీతం పడిందా? నెలవారీ ఖర్చులకు సరిపోవడం లేదా? ఇలా పొదుపు చేసి పెట్టుబడి పెట్టండి..!

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది.