Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. నెలకు కేవలం రూ. 5వేల పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు..!
Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ ద్వారా కేవలం నెలకు రూ. 5వేలు పెట్టుడితో ఎన్ని ఏళ్లలో లక్షాధికారి అవుతారో తెలుసా?

Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం పోస్టాఫీసులో (Post Office Scheme) అద్భుతమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
పెట్టుబడికి పోస్టాఫీసు పథకాలు చాలా సురక్షితం. అందులో ప్రధానంగా పోస్టాఫీస్ RD (Recurring Deposit Scheme) పథకం బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి రాబడిని పొందవచ్చు.
పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. ఈ పథకంలో ప్రస్తుతం 6.7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీస్ RD పథకాన్ని కేవలం రూ. 100 పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు.
ఈ పథకంలో వచ్చే రాబడిని ప్రతి త్రైమాసికంలో లెక్కిస్తారు. పోస్టాఫీస్ RD పథకంలో నెలకు రూ. 5వేలు పెట్టుబడితో లక్షాధికారిగా మారవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పెట్టుబడి మొత్తం : నెలకు రూ. 5వేలు
పెట్టుబడి కాల పరిమితి : 10 ఏళ్లు
రాబడి : 6.7 శాతం వడ్డీ
మీరు పోస్టాఫీస్ RD పథకంలో (Post Office Scheme) ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెడితే.. 10 ఏళ్లలో 6.7 శాతం రాబడి రేటుతో రూ. 8,54,272 సంపాదించుకోవచ్చు.
ఈ 10 ఏళ్లలో వచ్చే రాబడి రూ. 2,54,272 అవుతుంది. పెట్టుబడి మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. అంటే.. ఇంట్లో కూర్చుని రూ. 2 లక్షలు సంపాదిస్తారు అనమాట. నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుతూ పోతే రాబడి కూడా అంతే స్థాయిలో పెరుగుతూ పోతుంది.
నెలకు రూ. 8వేలు పెట్టుబడి పెడితే (Post Office Scheme) :
ఈ పథకంలో ప్రతి నెలా రూ. 8వేలు చొప్పున 10 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. 6.7 శాతం రాబడి రేటుతో మొత్తం రూ. 13,66,840 సంపాదించుకోవచ్చు. అలాగే వచ్చే మొత్తం వడ్డీ రెట్టింపు అవుతుంది. పదేళ్లలో పథకం నుంచి వచ్చే రాబడి రూ. 4,06,840 అవుతుంది.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై బిగ్ అప్‌డేట్.. రూ. 2వేలు పడతాయో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు..!
భవిష్యత్తులో ఏవైనా ఖర్చుల కోసం డబ్బులు సేవింగ్ చేయాలంటే RD పథకం అద్భుతంగా ఉంటుంది. మెరుగైన రాబడి కోసం మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ, ఇందులో వచ్చే రాబడికి హామీ ఉండదని గమనించాలి.
Disclaimer : పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడికి ముందు ఓసారి పోస్టాఫీసుకు వెళ్లి సంప్రదించండి.. ఆ తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోండి.