Samsung Galaxy Z Fold 6 : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?
Samsung Galaxy Z Fold 6 : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ మడతబెట్టే (Samsung Galaxy Z Fold 6) ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 రూ. 39వేల కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. గతంలో కన్నా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
Read Also : Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా..!
ఈ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్, మల్టీ టాస్కింగ్ ఫీచర్లకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. వెంటనే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఆఫర్లు :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ రూ.1,64,999కు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1,26,980కి లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6పై రూ.38,019 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
అలాగే, మీరు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ఇంకా సేవింగ్ చేయాలంటే పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంచ్ చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy Z Fold 6) :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. రెండు డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్‌లు కలిగి ఉన్నాయి.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరా కూడా ఉంది.
Read Also : Moto G85 5G : అతి చౌకైన ధరకే మోటో G85 5G ఫోన్.. టాప్ ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ప్రీమియం ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh డ్యూయల్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇన్‌స్టంట్ స్లో-మో, స్కెచ్ టు ఇమేజ్ సహా ఏఐ పవర్డ్ ఫీచర్లు, టూల్స్ అందిస్తుంది.