Moto G85 5G : అతి చౌకైన ధరకే మోటో G85 5G ఫోన్.. టాప్ ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
Moto G85 5G : మోటోరోలా మోటో G85 5G ఫోన్ టాప్ ఫీచర్లతో 23 శాతం డిస్కౌంట్ కలిగి ఉంది. అతి తక్కువ ధరకే మోటో అభిమానులు కొనేసుకోవచ్చు.

Moto G85 5G
Moto G85 5G : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటో హైఎండ్ 5G ఫోన్ (Moto G85 5G) సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా కంపెనీ మోటో G85 5G ఫోన్ కొనుగోలుపై భారీ ఆఫర్‌ను అందిస్తోంది.
ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లు, అదిరిపోయే డిజైన్‌తో ఇప్పుడు అమెజాన్‌లో ఖతర్నాక్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. 2025 మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన ఆప్షన్. ఇంతకీ ఈ మోటో G85 5G ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Read Also : Samsung Galaxy S24 Plus : ఆఫర్ అదిరింది బాస్.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 47వేలకే.. డోంట్ మిస్!
మోటో G85 5G ధర, ఆఫర్లు :
మోటో G85 5G ఫోన్ ఇప్పుడు రూ. 16,068 తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. లాంచ్ ధర రూ. 20,999 నుంచి 23 శాతం తగ్గింపు పొందింది.
రూ. 17వేల లోపు ధరలో పవర్‌ఫుల్ 5G స్మార్ట్‌ఫోన్ ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు రూ. 779 నుంచి ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా కూడా ఎంచుకోవచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 723.52 వరకు ఈఎంఐ ద్వారా రూ. 482 క్యాష్‌బ్యాక్, వడ్డీ పొందవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,250 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మర్చంట్ కస్టమర్లు GST బిల్లుల ద్వారా 28శాతం వరకు సేవింగ్ పొందవచ్చు.
మోటో G85 5G డిస్‌ప్లే, డిజైన్ :
మోటో G85 5G ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ అందిస్తుంది. సినిమాలు చూడటం లేదా సోషల్ మీడియా బ్రౌజింగ్, డిస్‌ప్లేతో అద్భుతమైన కలర్ క్లారిటీని అందిస్తుంది.
ఈ మోటో ఫోన్ ఆలివ్ గ్రీన్ కలర్‌లో లభ్యమవుతుంది. రిఫ్రెషింగ్, స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. ప్రీమియం లుక్ కోసం క్లీన్, స్పెషల్ డిజైన్‌ను కలిగి ఉంది.
మోటో G85 5G కెమెరా ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ సెన్సార్, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. హై క్వాలిటీ ఫొటోలకు అద్భుతంగా ఉంటుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ సైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. పవర్ ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. కెమెరా స్పెసిఫికేషన్‌లతో కంటెంట్ క్రియేషన్, సెల్ఫీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
Read Also : Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా..!
బ్యాటరీ, పర్ఫార్మెన్స్ :
5000mAh బ్యాటరీతో కూడిన మోటో G85 5G గేమింగ్, వెబ్ బ్రౌజింగ్, స్ట్రీమింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 8GB ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది. సిల్కీ-స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, లాగ్-ఫ్రీ కంప్యూటింగ్‌ను అందిస్తుంది.