Samsung Galaxy S24 Plus : ఆఫర్ అదిరింది బాస్.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 47వేలకే.. డోంట్ మిస్!
Samsung Galaxy S24 Plus : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ధర భారీగా తగ్గింది..

Samsung Galaxy S24 Plus
Samsung Galaxy S24 Plus : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేసే వారి కోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G (Samsung Galaxy S24 Plus) అతి తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ ఫోన్ కెమెరా డిజైన్, డిస్‌ప్లేతో పాటు అనేక ఆకర్షణీయమైన ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ సొంతం చేసుకోవడానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు.
అది ఎలా అని ఆలోచిస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. గెలాక్సీ S24 ప్లస్ 5G ఫోన్ రూ.50,500 లోపు ధరకే కొనేసుకోవచ్చు. మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ రూ.99,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ.52,999కే అందుబాటులో ఉంది. ఏకంగా ధర రూ.47వేలు తగ్గింది.
క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ.2,650 సేవ్ చేయొచ్చు. ట్రేడ్-ఇన్ ఆఫర్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ మంచి వర్కింగ్ కండిషన్ కలిగి ఉంటే మోడల్ ఆధారంగా రూ. 38,600 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24+ (Samsung Galaxy S24 Plus) స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 6.7-అంగుళాల 2K LTPO అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 2400 SoC ద్వారా 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4900mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.