Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా..!

Jio Cheapest Plan : జియో యూజర్ల కోసం సరికొత్త చీపెస్ట్ ప్లాన్ అందిస్తోంది. 72 రోజుల వ్యాలిడిటీతో 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు.

Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా..!

Reliance Jio

Updated On : June 2, 2025 / 10:44 PM IST

Jio Cheapest Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో పోర్ట్‌ఫోలియోలో అనేకే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌ ధరలోనే రీఛార్జ్ ప్లాన్లు ఎంచుకోవచ్చు. జియో అద్భుతమైన (Jio Cheapest Plan)  ప్లాన్‌తో ఫ్రీ డేటాను పొందవచ్చు.

Read Also : Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ పిక్సెల్ ఫోన్ ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు.. వదులుకోవద్దు భయ్యా..!

రిలయన్స్ జియో కస్టమర్ అయితే ప్రతిరోజూ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. జియో అందిస్తున్న ఈ ప్లాన్‌తో 20GB వరకు ఫ్రీ హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఇంతకీ జియో అందించే ఈ ప్లాన్ ధర ఎంత? బెనిఫిట్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.

జియో 749 ప్లాన్ (Jio Cheapest Plan) : 
రిలయన్స్ జియో రూ. 749 ప్లాన్‌తో వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌లో 20GB వరకు అదనపు డేటా కూడా పొందవచ్చు. జియో ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100SMS కూడా పొందవచ్చు.

ఈ ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీతో 144GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 20GB ఫ్రీ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 164GB డేటాను అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Plus : ఆఫర్ అదిరింది బాస్.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 47వేలకే.. డోంట్ మిస్!

ఈ ప్లాన్ 90 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్,టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. అదనంగా, ఫ్రీగా 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీని కూడా అందిస్తుంది. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.