Financial Tips : ఈ నెల జీతం పడిందా? నెలవారీ ఖర్చులకు సరిపోవడం లేదా? ఇలా పొదుపు చేసి పెట్టుబడి పెట్టండి..!

Financial Tips : నెలవారీ జీతం సరిపోవడం లేదా? జీతం డబ్బులు నెలాఖరులోగా ఖాళీ అయిపోతున్నాయా? పొదుపుతో పాటు ఎలా పెట్టుబడి పెట్టాలంటే?

Financial Tips : ఈ నెల జీతం పడిందా? నెలవారీ ఖర్చులకు సరిపోవడం లేదా? ఇలా పొదుపు చేసి పెట్టుబడి పెట్టండి..!

Financial Tips

Updated On : June 3, 2025 / 12:37 PM IST

Financial Tips : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, వెంటనే జీతంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టండి.. చాలామంది జీతం పడిన (Financial Tips) వెంటనే ఖర్చులకు సరిపోవడం లేదని చెబుతుంటారు.

ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈ రోజుల్లో జీతం పడటమే ఆలస్యం.. ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. వచ్చిన జీతం వచ్చినట్టే నీళ్లలా ఖర్చు అయిపోతుంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై బిగ్ అప్‌డేట్.. రూ. 2వేలు పడతాయో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు..!

నెలాఖరులోగా జేబులు ఖాళీ అవుతాయి. దాంతో నెల చివరి రోజులు కుటుంబంతో గడపడం చాలా కష్టమవుతుంది. మీరు కూడా మీ జీతం నుంచి ఖర్చులను తగ్గించుకోలేకపోతున్నారా?

నెల జీతం సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే మీ జీతం ఎంత వచ్చినా ఎలా ఖర్చులను తగ్గించుకోవాలి? పెట్టుబడి ఎలా పెట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పొదుపుగా ఖర్చు చేయాలంటే? :
ఉదాహరణకు.. మీరు నెలకు రూ. 30వేలు సంపాదిస్తుంటే.. మీ ఖర్చులను తగ్గించుకునేందుకు మొదట మీ జీతంలో 50 శాతం అంటే.. రూ. 15వేలు ముఖ్యమైన ఖర్చుల కోసం వెచ్చించాలి.

ఇంటి అద్దె, వాటర్-పవర్ బిల్లు, ఇంటి రేషన్, ఆరోగ్యం, ట్రావెల్ వంటి కోసం వినియోగించండి. ఇంటి అద్దె రూ. 6వేలు అయితే రేషన్, ఇతర ఖర్చులకు రూ. 5వేలు, విద్యుత్, వాటర్ బిల్లు రూ. 2వేలు, రవాణాతో పాటు ఆరోగ్యానికి రూ. 2వేలు వెచ్చించాలి.

ఇలా పెట్టుబడి పెట్టండి :
రూ. 30వేల రూపాయల (Financial Tips) జీతంలో ప్రతి నెలా రూ. 6వేలు లేదా 20 శాతం ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఇందుకోసం SIP, FD వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. నెలకు కేవలం రూ. 5వేల పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు..!

మిగిలిన డబ్బును బీమా, ఎమర్జెన్సీ ఫండ్, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. పెట్టుబడి కోసం రూ. 6వేలు పెడితే.. ఎమర్జెన్సీ ఫండ్ కోసం రూ. 1000, ఆరోగ్య బీమా కోసం రూ. 1000, ఈఎంఐకి రూ. 3000, ఇతర ఖర్చులకు రూ. 4వేలుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు.