Redmi Turbo 5 First Sale : కొత్త రెడ్‌మి టర్బో 5 ఫస్ట్ సేల్ దుమ్మురేపుతోంది! బ్యాంక్ ఆఫర్లతో బంపర్ డిస్కౌంట్లు.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు!
Redmi Turbo 5 First Sale : రెడ్‌మి టర్బో 5 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. బ్యాంకుల కార్డులతో పాటు ఇతర ఆఫర్ల ద్వారా అతి చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ సేల్ ఆఫర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- June 19, 2026 / 07:29 PM IST
Redmi Turbo 5 First Sale
- రెడ్‌మి టర్బో 5లో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లే
- 50MP ప్రైమరీ కెమెరా, 7540mAh బ్యాటరీ సెటప్
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్
Redmi Turbo 5 First Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ఇటీవలే షావోమీ నుంచి కొత్త రెడ్‌మి టర్బో 5 ఫోన్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ షావోమీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. 50MP ప్రైమరీ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరాతో టర్బో 5లో 100W ఫాస్ట్ (Redmi Turbo 5 First Sale) ఛార్జింగ్‌తో 7540mAh బ్యాటరీ అమర్చారు. రెడ్‌మి టర్బో 5 ఫోన్ ధర, ఫీచర్లు, లభ్యత వివరాలపై ఓసారి లుక్కేయండి.
రెడ్‌మి టర్బో 5 ధర, ఆఫర్లు :
రెడ్‌మి టర్బో 5 ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 కాగా, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999గా ఉంది. టర్బో 5 సేల్స్ జూన్ 19న అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా కొనుగోలుదారులు యాక్సిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, బీఒబీ, కోటక్ క్రెడిట్ కార్డులపై ఫ్లాట్ రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Amazon Prime Day 2026 : అమెజాన్ సేల్ డేట్ లీక్! ఫోన్, TV కొనేవారికి డబుల్ ధమాకా, AIతో అదిరిపోయే డిస్కౌంట్లు!
రెడ్‌మి టర్బో 5 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి టర్బో 5లో 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఉంది. షావోమీ ప్రీమియం ఐ ప్రొటెక్షన్, TÜV ట్రిపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్‌తో వస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రెడ్‌మి 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
రెడ్‌మి టర్బో 5లో OIS, ఈఐఎస్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, రియర్ సైడ్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంది.
రెడ్‌మి టర్బో 5లో 7540mAh బ్యాటరీ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C 2.0 పోర్ట్, NFC ఉన్నాయి.
