Reliance Jewels : అక్షయ తృతీయ వేడుకలు.. రిలయన్స్ జ్యువెల్స్ ‘వింధ్య కలెక్షన్’ ఆవిష్కరించిన దిశా పటానీ

వారణాసిలోని రిలయన్స్ జ్యువెల్స్ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్ ఐకాన్, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ప్రత్యేక ఫెస్టివల్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు.

Reliance Jewels : భారత ప్రముఖ ఆభరణాల బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ ఈ 2024 ఏడాదిలో అక్షయ తృతీయ వేడుకలను పురస్కరించుకుని వింధ్య కలెక్షన్ ఆవిష్కరించింది. పండుగ సందర్భంగా అద్భుతమైన కలెక్షన్లతో జ్యువెల్స్ ఆఫ్ ఇండియా కలెక్షన్ సిరీస్‌లో 9వ వింధ్య మధ్యప్రదేశ్‌లోని గొప్ప కళా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. వారణాసిలోని రిలయన్స్ జ్యువెల్స్ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్ ఐకాన్, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ప్రత్యేక ఫెస్టివల్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు.

హిందూ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన పండుగ రోజున ఆభరణాలను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పండుగను పురస్కరించుకుని రిలయన్స్ జ్యువెల్స్ వింధ్య కలెక్షన్.. మధ్యప్రదేశ్ గొప్ప సాంస్ర్కృతిక వారసత్వం, నిర్మాణ వైభవానికి నివాళి అర్పించేలా అద్భుతమైన ఆభరణాల శ్రేణిని అందిస్తోంది. గ్వాలియర్ కోట, సాంచి స్థూపం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం, మితౌలి బటేశ్వర్ దేవాలయాలు వంటి మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ కట్టడాల స్ఫూర్తితో ప్రతి నగను డిజైన్ చేశారు.

Vindhya collection

ఈ సందర్భంగా జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఈ అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దేశ వైవిధ్యమైన సాంస్ర్కృతిక వారసత్వాన్ని పండుగలా జరుపుకోవడమే దీనికి నిదర్శనం. భారతీయ కళ, హస్తకళా నైపుణ్యానికి తార్కణంగా నిలుస్తుంది. ఈ కలెక్షన్ కేవలం సొగసుకు మాత్రమే ప్రతీక కాదు.. అక్షయ తృతీయ మా బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ శాశ్వాత వేడుక స్ఫూర్తికి కూడా ప్రతీక’ అని పేర్కొన్నారు.

స్టోర్ కలెక్షన్ ఆవిష్కరించిన దిశా పటానీ మాట్లాడుతూ..‘‘ఈ కలెక్షన్‌లో ప్రతి నగ మధ్యప్రదేశ్ గొప్ప సాంస్ర్కృతిక వారసత్వం, నిర్మాణ వైభావాన్ని ప్రతిబింభించే కళాఖండం. ఉజ్జయినిలోని దేవాలయాల అంశాలను అందంగా అలకరించిన డైమండ్ నెక్లెస్ డిజైన్ నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చింది. ఇవి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు.. ఇదో సాంప్రదాయం, సౌందర్యానికి నిజమైన చిహ్నాలు, ప్రతి వార్డ్ రోబ్‌‌లో తప్పనిసరిగా ఉండాలి’ అని అన్నారు.

వింధ్య కలెక్షన్ ఇప్పుడు అన్ని రిలయన్స్ జ్యువెల్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ అక్షయ తృతీయ సీజన్‌లో వినియోగదారులు ఈ ఆకర్షణీయమైన నగలను అలంకరించుకోవచ్చు.

Read Also : Tech Star Shahrukh : ఈ సింపుల్ ట్రిక్‌తో దొంగలు కొట్టేసిన 2 ఫోన్లు భలే పట్టేశాడు.. నువ్వు సూపర్ బ్రో..!

ట్రెండింగ్ వార్తలు