Royal Enfield Flying Flea C6 : సూపర్ బైక్ బ్రో.. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 154కి.మీ రేంజ్.. ధర జస్ట్..!

Royal Enfield Flying Flea C6 : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6 మోడల్ రూ. 2.79 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Royal Enfield Flying Flea C6

  • యూత్ మెచ్చిన రాయల్ ఎన్ ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ బైక్ ఇదే
  • భారత మార్కెట్లో రూ. 2.79 లక్షల ప్రారంభ ధరతో లాంచ్
  • కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 60 km/h స్పీడ్ అందుకోగలదు
  • 65 నిమిషాల్లో బ్యాటరీ 20శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్

Royal Enfield Flying Flea C6 : కుర్రాళ్ల డ్రీమ్ బైక్ వచ్చేసింది. పెట్రోల్ బైకు కాదు భయ్యా.. కొత్త ఎలక్ట్రిక్ బైక్.. భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6 లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ రూ. 2.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS)తో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కంపెనీ నుంచి ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కాగా, భవిష్యత్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ బైక్‌లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఫ్లయింగ్ ఫ్లీ C6: రేంజ్, ఫీచర్లు :
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 బైక్ మోడల్ 15.4kW (20hp) PMSM ఎలక్ట్రిక్ మోటార్, 3.91kWh బ్యాటరీతో వస్తుంది. స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ బైక్ కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 60 km/h స్పీడ్ అందుకోగలదు.

గరిష్టంగా 115 km/h వేగాన్ని చేరుకోగలదు. కంపెనీ 154 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను క్లెయిమ్ చేస్తోంది. ఆన్‌బోర్డ్ ఛార్జర్ సుమారు 65 నిమిషాల్లో బ్యాటరీని 20శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

ఫ్లయింగ్ ఫ్లీ C6 ఫీచర్లు :
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లో పట్టణ ప్రాంత రైడర్‌ల కోసం అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. ఇందులో ఆల్-ఎల్ఈడీ లైటింగ్, గూగుల్ ఆధారిత ఆన్‌బోర్డ్ నావిగేషన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఇంకా స్పోర్ట్, ఇండివిడ్యువల్ వంటి రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఇండివిడ్యువల్ మోడ్‌లో, రైడర్లు ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, థ్రాటిల్ రెస్పాన్స్‌ను నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

ఫ్లయింగ్ ఫ్లీ C6 డిజైన్ :
డిజైన్ పరంగా ఫ్లయింగ్ ఫ్లీ C6 స్పెషల్, కాంపాక్ట్ డిజైన్ అందిస్తుంది. ఈ బైక్ వింటేజ్ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్, గర్డర్-టైప్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్లోటింగ్ సీట్, రిమూవబుల్ పిలియన్ సీట్ ఉన్నాయి. ప్రత్యేక ఫీచర్లతో ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సాంప్రదాయ పెట్రోల్ బైక్‌ల కన్నా పూర్తిగా భిన్నంగా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

బైక్ ఏరోడైనమిక్స్, కూలింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అల్యూమినియం కేసింగ్‌లో బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ ఫీచర్లన్నింటితో ఈ బైక్ కేవలం 124 కేజీల బరువుతో ఇప్పటివరకు వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలోకెల్లా అత్యంత తేలికైనదిగా నిలిచింది.

Read Also : UPI New Rules : యూపీఐ పేమెంట్లపై RBI కొత్త రూల్.. రూ. 10వేలకు పైగా పేమెంట్ చేస్తే గంటవరకు డబ్బులు పడవు.. ఎందుకంటే?

టెక్నాలజీ, ఇంటిగ్రేషన్ :
ఫ్లయింగ్ ఫ్లీ C6 లో రిమోట్ మానిటరింగ్‌తో పాటు Wi-Fi, బ్లూటూత్, 4G కనెక్టివిటీ వంటి మోడ్రాన్ టెక్నాలజీ ఉన్నాయి. ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ కూడా అందిస్తుంది. కాలక్రమేణా సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని అప్‌గ్రేడ్స్ జరుగుతాయి.

ప్లాట్‌ఫారమ్ డెవలప్‌మెంట్ :
ఈ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఫ్లయింగ్ ఫ్లీ టెక్ సెంటర్‌లో పూర్తిగా ఇంటర్నల్‌గా నిర్మించారు. ఈ బైక్ డెవలప్ కోసం భారత్ యూకే నుంచి 200 మందికి పైగా ఇంజనీర్లు పనిచేశారు. ఇందుకోసం 45కి పైగా పేటెంట్లు దాఖలు అయ్యాయి.

FF.C6 ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది. ‘డిజైన్ కాన్సెప్ట్’ కేటగిరీలో రెడ్ డాట్ అవార్డ్ 2025ను గెలుచుకుంది. ఈ ప్రారంభోత్సవంపై ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ మాట్లాడుతూ.. కంపెనీ 125 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ C6 కేవలం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మాత్రమే కాదు. ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ కింద భవిష్యత్తులో అనేక కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ బైకులను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫ్లయింగ్ ఫ్లీ C6 :
రాయల్ ఎన్‌ఫీల్డ్ C6తో పాత మోటార్‌సైక్లింగ్ వారసత్వాన్ని స్మార్ట్ కనెక్టెడ్ అర్బన్ మొబిలిటీతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సరికొత్త ఐడెంటిటీని క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.