UPI New Rules : యూపీఐ పేమెంట్లపై RBI కొత్త రూల్.. రూ. 10వేలకు పైగా పేమెంట్ చేస్తే గంటవరకు డబ్బులు పడవు.. ఎందుకంటే?
UPI New Rules : యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ అమల్లోకి రానున్నాయి.ఇకపై రూ. 10వేలకు పైగా పేమెంట్లుచేస్తే గంట వరకు డబ్బులు అకౌంట్లలో పడవు.. పూర్తి వివరాలివే..
RBI UPI New Rules
- యూపీఐలో పెద్ద లావాదేవీలపై ఆర్బీఐ కొత్త రూల్స్
- రూ.10వేలకు పైగా యూపీఐ పేమెంట్లపై గంటవరకు పడవు
- సినీయర్ సిటిజన్ల లావాదేవీలపై కొత్త ప్రొటెక్షన్ రూల్స్
UPI New Rules : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? మీకో బిగ్ షాకింగ్ న్యూస్.. ఇకపై యూపీఐతో చేసే పెద్ద లావాదేవీలపై కఠినమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ భారీ మొత్తంలో యూపీఐ పేమెంట్ల ప్రాసెస్ డిలే విధానం ప్రవేశపెట్టనుంది.
ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లకు సంబంధించి (UPI New Rules) పెద్ద మొత్తంలో యూపీఐ లావాదేవీలకు అదనపు ప్రొటెక్షన్ అందించనుంది. ఈ కొత్త నిబంధనలతో అనుమానాస్పద లావాదేవీలను మానిటరింగ్ చేయనున్నారు. అది ఫ్రాడ్ పేమెంట్ తేలితే అమౌంట్ ప్రాసెస్ అవ్వదు అనమాట.
ఉదాహరణకు.. మీరు యూపీఐ నుంచి రూ.10వేలకు పైగా అమౌంట్ పంపితే అది పూర్తిగా ప్రాసెస్ అయి అవతలి వ్యక్తి అకౌంటులో క్రెడిట్ అయ్యేందుకు సరిగ్గా గంట వరకు సమయం పడుతుంది. ఆన్లైన్ మోసాల్లో భారీ డిజిటల్ పేమెంట్లను ఎక్కువ సమయం హోల్డ్ చేయనుంది. సీనియర్ సిటిజన్ల పేమెంట్లపై అదనపు నిఘా వంటి కొత్త చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశీలిస్తోందని నివేదిక తెలిపింది.
భారీ పేమెంట్లు ఆలస్యం, మోసాలపై మానిటరింగ్ :
దేశంలో డిజిటల్ పేమెంట్ల మోసాలు వేగంగా పెరిగాయి. ఫేక్ కాల్ సెంటర్లు, మ్యూల్ అకౌంట్లు, డీప్‌ఫేక్‌ల వంటి కొత్త మెథడ్స్ వాడుతున్నారు. ఇలాంటి మోసాలను నివారించేందుకు ఆర్బీఐ రూ. 10వేలు దాటిన లావాదేవీల సమయం గంట ఆలస్యం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ కొత్త రూల్ యూపీఐ పేమెంట్లకు కూడా వర్తిస్తుంది. తద్వారా వినియోగదారులు తమ లావాదేవీలను ఈ గ్యాప్‌లోనే నిలిపివేయవచ్చు. అయితే, బిజినెస్ పేమెంట్లకు వర్తించదు.
ఇన్స్టంట్ పేమెంట్లు, అనుమానాస్పద పేమెంట్లపై వార్నింగ్ :
ఏదైనా భారీ మొత్తంలో పేమెంట్ చేసినప్పుడు ప్రాసెస్ డిలే అవుతుంది. ఈ సమయంలో ఫండ్స్ తాత్కాలికంగా అకౌంట్ నుంచి డెబిట్ చేస్తామని ఏదైనా లావాదేవీ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అలర్ట్ జారీ చేస్తామని ఆర్బీఐ పేర్కొంది.
అయితే, రోజువారీ పేమెంట్లకు అంతరాయం ఉండదు. ఎప్పటిలాగా చిన్న లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2025 మధ్య మోసాల కేసులు 10 రెట్లు పెరిగి 28 లక్షలకు చేరుకున్నాయి. దీని కారణంగా రూ. 23 కోట్ల నష్టం వాటిల్లింది.
వృద్ధులకు ప్రత్యేక భద్రత :
వృద్ధులు, బలహీన వర్గాల యూజర్ల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ అందించాలని ఆర్బిఐ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. 70 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు రూ. 50వేలకు పైగా లావాదేవీలు చేస్తే వారికి నమ్మకమైన వ్యక్తి నుంచి అనుమతి తప్పనిసరి. అయితే, ఇది కావాలా లేదా అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
కొన్ని ఖాతాలపై పరిమితులు విధించాలని, అవసరమైతే అన్ని డిజిటల్ పేమెంట్లను తక్షణమే నిలిపివేసేందుకు ‘కిల్ స్విచ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ విషయంపై మే 8వ తేదీలోగా సూచనలు ఇవ్వాలని ఆర్బీఐ కోరింది. ఆ తర్వాతే పూర్తి నిబంధనలను ఖరారు చేసే అవకాశం ఉంది.
