Royal Enfield Meteor 350 : బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ EMIతో రాయల్ ఎన్‌ఫీల్డ్.. నెలకు రూ.5,321 చెల్లిస్తే చాలు

Royal Enfield Meteor 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 బుల్లెట్ బైక్ సరసమైన ధరలో లభిస్తోంది. నెలకు రూ. 5,321 ఈఎంఐ చెల్లించి వెంటనే ఈ బుల్లెట్ బైక్ ఇంటికి తెచ్చుకోవచ్చు..

Royal Enfield Meteor 350

Royal Enfield Meteor 350 : రోడ్లపై రాజులా వెళ్లాలనుకుంటే ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ కొనాల్సిందే. పవర్‌ఫుల్ క్రూయిజర్ బైక్‌ కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్. ముఖ్యంగా మిడిల్ క్లాసు ఫ్యామిలీలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 సరసమైన ధరకే లభిస్తోంది.

కేవలం నెలకు రూ. 5,321 ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ బైక్ క్లాసిక్ లుక్ మాత్రమే కాకుండా పవర్‌ఫుల్ 350cc ఇంజిన్ ‘ట్రిప్పర్ నావిగేషన్’ వంటి మోడ్రాన్ ఫీచర్లతో వస్తుంది. ఈ బుల్లెట్ బైక్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మీటియోర్ 350 ఆన్-రోడ్ ధర :
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 బేస్ వేరియంట్ ‘ఫైర్‌బాల్’, ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,95,762కు లభిస్తుంది. ఆర్టీఓ ఛార్జీలు రూ. 16,191, ఇన్సూరెన్స్ కోసం సుమారు రూ. 10,902 చెల్లించాలి. ఆన్-రోడ్ ధర సుమారు రూ. 2,22,855కి చేరుకుంటుంది.

మీరు కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చేస్తే.. మిగిలిన రూ. 2,12,855 బ్యాంకు లోన్ ద్వారా పొందవచ్చు. 10శాతం వార్షిక వడ్డీ రేటుతో, 5 ఏళ్లు (60 నెలలు) సుమారు రూ. 5,321 ఈఎంఐ చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

జే సిరీస్ ఇంజిన్, స్మూత్ పర్ఫార్మెన్స్ :
ఈ ఇంజిన్ 20.2bhp, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పాత మోడళ్లతో పోలిస్తే కౌంటర్-బ్యాలెన్సర్ టెక్నాలజీతో వైబ్రేషన్‌ ఉండదు. ఈ బైక్ హైవేపై వేగంగా దూసుకెళ్లగలదు. సిటీ ట్రాఫిక్‌లో కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం 15 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 114 కిమీ అందుకుంటుంది.

Read Also : Mercedes-Benz Cars : లగ్జరీ కార్ల మార్కెట్లో బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న ఆడి, బెంజ్ కార్ల ధరలు

మెటియోర్ 350 మైలేజీ ఎంతంటే?
క్రూయిజర్ ఔత్సాహికులకు మైలేజ్ అద్భుతంగా ఉంటుంది. మీటియోర్ 350 కేటగిరీలో ARAI-సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 41.88 కి.మీ అందిస్తుంది. అయితే, రియల్ టైమ్ డ్రైవింగ్ పరిస్థితులలో నగరంలో 35 కి.మీ/లీ, హైవేపై 38 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. భారీ 15-లీటర్ ఫ్యూయిల్ ట్యాంక్‌ ఉంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 500 కి.మీ నుంచి 600 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

స్మార్ట్ ఫీచర్లు, రైడింగ్ కంఫర్ట్ :
మీటియోర్ 350 కేవలం లుక్స్ కాదు.. టెక్నాలజీలోనూ టాప్ మోడల్. అద్భుతమైన LED హెడ్‌లైట్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. ట్రిప్పర్ నావిగేషన్ ద్వారా మీ ఫోన్‌కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సీటు ఎత్తు కేవలం 765mm మాత్రమే. సేఫ్టీ కోసం ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్‌లు, రియర్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది.