×
Ad

Stock Market : ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ రయ్.. రయ్.. జస్ట్ 15 నిమిషాల్లోనే ఏకంగా రూ. 13 లక్షల కోట్లు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుషీ..!

Stock Market : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 3) సెషన్‌లో రికార్డు స్థాయిలో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2 వేల పాయింట్లకుపైగా లాభాల్లో దూసుకుపోతోంది.

Stock Market

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. భారత్‌తో ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. సెన్సెన్స్, నిఫ్టీ భారీగా లాభాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బీఎస్‌ఇ సెన్సెక్స్, ఇండెక్స్ మంగళవారం (ఫిబ్రవరి 3)న ఏకంగా 4200 పాయింట్లు (5.1 శాతం)తో ఎగబాకింది. దాంతో సెన్సెక్స్ 85871.73 పాయింట్లకు చేరుకుంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 1252 పాయింట్లతో 26341.20 పాయింట్లకు చేరుకుంది.

భారత్‌పై విధిస్తున్న 25 శాతం ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు.. రష్యా నుంచి చమురు కొనుగోలుపై విధించిన 25 శాతం అదనపు సుంకాల్ని కూడా పూర్తిగా ఎత్తేస్తున్నట్టు వెల్లడించారు. దాంతో దేశీయంగా ఇన్వెస్టర్లలో సందడి నెలకొంది. పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు అమాంతం భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా ఒక శాతం పెరిగి రూ. 90.30 స్థాయిలో నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లోనే ఈ ర్యాలీ పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ. 13 లక్షల కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 468.32 లక్షల కోట్లకు చేరుకుంది.

ఈ పరిణామం మార్కెట్ సెంటిమెంట్‌ మరింత పెంచింది. సెన్సెక్స్‌లోని టాప్ 30 కంపెనీలలో 30 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ఫలితంగా పెట్టుబడిదారులకు భారీగా లాభాలు వచ్చాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ షేర్లు భారీగా లాభాలను ఆర్జించాయి.

Stock Market : డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి :

టారిఫ్ కోతలు రూపాయిపై కూడా ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక శాతం బలపడింది. ఇప్పుడు ఒక డాలర్ విలువ 90.42 ఉండగా రూపాయి 1.2 శాతం పెరిగింది. ప్రారంభానికి ముందు సెషన్‌లో స్టాక్ మార్కెట్ అనూహ్య పెరుగుదలను చూసింది. సెన్సెక్స్ 3,647.89 పాయింట్లు లేదా 4.47 శాతం పెరిగి 85,314.35 వద్ద ట్రేడవుతోంది. ట్రంప్ సుంకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also : Gold jewellery : విదేశాల నుంచి బంగారం తీసుకొస్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్.. గరిష్ఠ పరిమితిలో భారీ మార్పులు..

సోమవారం రాత్రి ఆలస్యంగా ట్రంప్ సోషల్ మీడియా సైట్ ట్రూతౌట్‌లో భారత్ పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 25 శాతం పరస్పర సుంకాన్ని కూడా తొలగించనున్నట్టు ప్రకటించారు. ట్రంప్ సుంకాల కోతల సానుకూల ప్రభావం ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడింది.

గత ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు (FII) 18 బిలియన్ డాలర్లు విక్రయించారు. ఈ ఏడాది జనవరిలో కూడా భారీగా షేర్లు అమ్ముడయ్యాయి. అయితే, ట్రంప్ సుంకాల తగ్గింపుతో పెట్టుబడిదారుల వైఖరి సానుకూలంగానే ఉంది. మరోసారి, దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు పెరగనున్నాయి.

గత సోమవారం బీఎస్‌ఇ సెన్సెక్స్ 943 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 263 పాయింట్లు లాభపడింది. చమురు, గ్యాస్, బ్యాంకింగ్, ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లే దీనికి కారణమయ్యాయి. 30 షేర్ల బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 943.52 పాయింట్లు లేదా 1.17 శాతం పెరిగి 81,666.46 వద్ద ముగిసింది. 1,009.31 పాయింట్లు పెరిగి 81,732.25 గరిష్ట స్థాయికి చేరుకుంది.