7 Seater Cars Discount : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ 7 సీటర్ కార్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

7 Seaters Car Discount : 7 సీటర్ కార్లపై ఖతర్నాక్ డిస్కౌంట్ ఆఫర్లు.. దాదాపు రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అద్భుతమైన ఆఫర్లను అసలు వదులుకోవద్దు..

7 Seater Cars Discount

7 Seater Cars Discount : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుత మార్కెట్లో ఎక్కువ సీట్లు ఉన్న కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అందులోనూ ప్రత్యేకించి 7-సీటర్ కార్ల (7 Seater Cars Discount) గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. చాలా మంది కొనుగోలుదారులు ఎక్కువగా ఈ సెవెన్ సీటర్ కార్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు.

మార్కెట్లో అందుబాటులో ఉన్న 7-సీటర్ కార్లు అనేక ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్‌ కలిగి ఉన్నాయి. అయితే, ఈ జూన్ 2025లో 7-సీట్ల కార్లపై రూ. 3 లక్షల భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి ఇన్విక్టో, హ్యుందాయ్ అల్కాజార్, జీప్ మెరిడియన్ వంటి 7-సీటర్ కార్ల మోడల్స్ డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ఇందులో మీకు నచ్చిన కారు ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు? ఎవరు అర్హులు? లబ్ధిదారుల ఫుల్ లిస్ట్ ఇదిగో.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..!

1. మారుతి ఇన్విక్టో కారు :
మారుతి బ్రాండ్ కార్లలో అత్యంత ఖరీదైన ప్రీమియం మారుతి ఇన్విక్టో కారు ఒకటి.. ఈ 7-సీటర్ కారు ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. కంఫర్ట్, స్పేస్ కారణంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. రూ. 1.40 లక్షల వరకు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌లో రూ. 25వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 1.15 లక్షల వరకు స్క్రాపేజ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Maruti Invicto

ఇన్విక్టో పనోరమిక్ సన్‌రూఫ్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 150bhp, 188Nm ఉత్పత్తి చేసే 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు e-CVTని కలిగిఉంది. మారుతి ఇన్విక్టో ధర రూ. 30.26 లక్షల నుంచి రూ. 34.60 లక్షల వరకు (ఆన్-రోడ్, ముంబై) ఉంటుంది.

2. జీప్ మెరిడియన్ :
జీప్ మెరిడియన్ ప్రీమియం SUV మోడల్ (7 Seater Cars Discount) చాలా విశాలమైనది. ఫీచర్-రిచ్ క్యాబిన్‌ కలిగి ఉంది. మార్కెట్లో అత్యుత్తమ 7-సీటర్లలో ఇదొకటి. ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మెరిడియన్ రూ. 3.6 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 2.3 లక్షల క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు. 1.3 లక్షల స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ మెరిడియన్ MY2024 స్టాక్‌పై మాత్రమే అందుబాటులో ఉందని గమనించాలి.

Jeep Meridian

7-సీట్ల SUV లెవల్ 2 అడాస్ సూట్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.2-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. మెరిడియన్ 168bhp, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంది. 6-స్పీడ్ MT లేదా 9-స్పీడ్ TC 4WDతో వస్తుంది. ఈ SUV జీప్ మోడల్ ధర రూ. 30.48 లక్షల నుంచి రూ. 47.20 లక్షల వరకు (ఆన్-రోడ్, ముంబై) ఉంటుంది.

Read Also : LIC Housing Finance : కస్టమర్లకు LIC గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు.. ఇకపై చౌకగా హోమ్ లోన్లు.. తగ్గనున్న ఈఎంఐల భారం..!

3. హ్యుందాయ్ అల్కాజార్ :
హ్యుందాయ్ అల్కాజార్ కారు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఈ 7-సీటర్ కారు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అల్కాజార్ మోడల్ కొనుగోలుపై రూ. 70వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ 7-సీటర్ ప్రీమియం ఇంటీరియర్ కంపర్ట్ క్యాబిన్‌ను కలిగి ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్, ఫస్ట్, సెకండ్ లైన్లలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.

Hyundai Alcazar

10.25-అంగుళాల డిస్‌ప్లే సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ SUV 2 మోడల్ కారు ఇంజన్ రెండు ఆప్షన్లలో వస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (114bhp & 250Nm), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (158bhp & 253Nm). ఈ హ్యుందాయ్ SUV కారు ధర రూ. 17.77 లక్షల నుంచి రూ. 26.36 లక్షల (ఆన్-రోడ్, ముంబై) వరకు ఉంటుంది.