LIC Housing Finance : కస్టమర్లకు LIC గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు.. ఇకపై చౌకగా హోమ్ లోన్లు.. తగ్గనున్న ఈఎంఐల భారం..!
LIC Housing Finance : ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఇకపై హోం లోన్లు చౌకగా మారనున్నాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.

LIC Housing Finance
LIC Housing Finance : కొత్తగా హోమ్ లోన్ తీసుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. LIC హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. తక్కువ వడ్డీ రేటుతో గృహ (LIC Housing Finance) రుణాలు తీసుకోవచ్చు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొత్త గృహ రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 6.25 శాతం నుంచి 6.00 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే.. ఇప్పుడు 7.50 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి. కంపెనీ 36వ వ్యవస్థాపక దినోత్సవం (జూన్ 19, 2025) నుంచి అమలులోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్త హోమ్ లోన్లపై బెనిఫిట్స్ :
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణాల వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్ 21, శనివారం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త గృహ రుణాలకు కొత్త వడ్డీ రేట్లు 7.50 శాతం నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది.
హోమ్ లోన్ ఎలా పొందాలి? :
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి గృహ రుణం పొందాలంటే మీరు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి. ఆ వెబ్‌సైట్‌లో కొత్త హోమ్ లోన్ కోసం అప్లయ్ చేసుకోవాలి. గృహ రుణానికి అర్హులో కాదో చెక్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ఐడెంటిటీ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత గృహ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
హోమ్ లోన్లకు చౌకగా అందించాలని నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ త్రిభువన్ తెలిపారు. సరసమైన ధరలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను మధ్య తరగతివారికి అందించేలా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తుంటే.. చాలామంది సొంతిల్లు కోసం ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే.. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోందని, అది కూడా 7.50 శాతం వడ్డీతోనే పొందవచ్చనని తెలిపారు.