Fingerprint 5G Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? టాప్ 7 ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!
Fingerprint 5G Phones : ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 5G ఫోన్లు కొంటున్నారా? టాప్ 7 ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 5G ఫోన్లను ఓసారి లుక్కేయండి..

Fingerprint 5G Phones
Fingerprint 5G Phones : ఫింగర్ ఫ్రింట్ 5G ఫోన్ల కోసం చూస్తున్నారా? మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసే ప్రతిసారీ లాంగ్ లాక్ స్క్రీన్ కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో టాప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీతో అనేక మోడల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల వినియోగదారులు నానోసెకన్లలో తమ ఫోన్‌లను అన్‌లాక్ చేయొచ్చు. ఆన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.. ఇందులో వన్‌ప్లస్ నార్డ్ 2T 5G నుంచి మోటో G72 వరకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
Read Also : OPPO A5 5G Launch : కొత్త ఒప్పో A5 5G వచ్చేసిందోచ్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరా హైలెట్.. ధర జస్ట్ ఎంతంటే?
వన్‌ప్లస్ నార్డ్ 2T 5G :
వన్‌ప్లస్ నార్డ్ 2T 5G అనేది ఫస్ట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ దిగువ అంచున ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కానీ, సెన్సార్ స్పీడ్ యాక్టివ్ గా పనిచేస్తుంది. స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు.. వన్‌ప్లస్ 2T 5G ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S21 FE :
శాంసంగ్ గెలాక్సీ S21 FE ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్మార్ట్‌ఫోన్. ఖరీదైన శాంసంగ్ ఫోన్లలో ఇదొకటి. అల్ట్రాసోనిక్ సెన్సార్‌లకు భిన్నంగా ఈ మోడల్ ఉంటుంది. 6.4-అంగుళాల, 120Hz డిస్‌ప్లేలో ఇంటిగ్రేట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెన్సార్ ఫోన్ ఎడ్జ్ వైపు ఉంటుంది. సెన్సార్ వేగంగా ఉంటుంది.
ఒప్పో రెనో 8 5G :
ఒప్పో రెనో 8 5G ఫింగర్ ప్రింట్-డిస్‌ప్లే ఫోన్. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S21 FE మాదిరిగానే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, గ్లోసీ డిస్‌ప్లే స్క్రీన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా :
స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ సెన్సార్ కలిగి ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్ కూడా ఒకటి. ఫింగర్‌ఫ్రింట్ ఒక ప్రత్యేకమైన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ సెన్సార్ మీ ఫింగర్ ప్రింట్ పొడిగా ఉన్నాయా లేదా తడిగా ఉన్నాయా లేదా గుర్తిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్ ప్రెజర్ సెన్సార్ కారణంగా లాగిన్ అయ్యేందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటుంది.
వన్‌ప్లస్ 10R 5G ఫోన్ :
ఈ వన్‌ప్లస్ 10R ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఈ లిస్టులో ఇతర సెన్సా్ర్ల మాదిరిగానే పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ కోసం యూజర్లు ఫింగర్ ఫ్రింట్స్ వినియోగించవచ్చు. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ లో రాంగ్ రిజెక్ట్ రేటును కలిగి ఉంటుంది. మీ ఫింగర్ ఫ్రింట్ డిటెక్ట్ చేయలేదనే ఆందోళన అక్కర్లేదు.
వివో V25 5G :
వివో V25 5G ఫోన్ 6.44-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్‌గా అన్‌లాక్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ కెమెరా మాడ్యూల్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
మోటో G72 :
ఫింగర్ ప్రింట్ ఫోన్లలో మోటో G72 అద్భుతమైన స్మార్ట్‌ఫోన్. ఫింగర్ ప్రింట్ రీడర్ విషయంలో అలా కాదు. అండర్ గ్లాస్ సెన్సార్ పెద్దదిగా ఉంటుంది. అన్‌లాక్ చేసే విషయంలో చాలా అడ్వాన్స్‌గా ఉటుంది. ఇలాంటి ఫోన్ కావాలంటే మోటో G72 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.