OPPO A5 5G Launch : కొత్త ఒప్పో A5 5G వచ్చేసిందోచ్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరా హైలెట్.. ధర జస్ట్ ఎంతంటే?

OPPO A5 5G Launch : ఒప్పో A5 5G ఫోన్ లాంచ్ అయింది. 6000mAH బ్యాటరీ, 50MP కెమెరా ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఎంతంటే?

OPPO A5 5G Launch : కొత్త ఒప్పో A5 5G వచ్చేసిందోచ్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరా హైలెట్.. ధర జస్ట్ ఎంతంటే?

OPPO A5 5G Launch

Updated On : June 22, 2025 / 1:41 PM IST

OPPO A5 5G Launch : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఒప్పో నుంచి కొత్త A5 5G ఫోన్ లాంచ్ అయింది. గత నెలలో ఒప్పో A5x 5G ఫోన్‌ (OPPO A5 5G Launch)కు అప్‌గ్రేడ్ వెర్షన్. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. ఈ ఒప్పో A5 5G ఫోన్ ధర, ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, బ్యాటరీ వంటి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి..

డిజైన్, మన్నిక :
ఒప్పో A5 5G ఫోన్ 360° ఆర్మర్ బాడీ డిజైన్, రీన్ఫోర్స్డ్ గ్లాస్ కలిగి ఉంది. పాత ఒప్పో A3 5G కన్నా 160శాతం ఎక్కువ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ ఇస్తుంది. ఫ్రేమ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో అల్లాయ్ ఫ్రేమ్ అమర్చారు. MIL-STD-810H సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది. సైనిక స్థాయి టెస్టింగ్‌లో కూడా పాస్ అయింది. IP65 రేటింగ్ కూడా ఉంది.

Read Also : Credit Score Myths : ‘క్రెడిట్ స్కోర్’పై అపోహలొద్దు.. ఇలా చేస్తే ఎప్పుడూ తగ్గదు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..!

డిస్‌ప్లే, లుక్స్ :
ఈ ఒప్పో ఫోన్ 6.67-అంగుళాల HD + LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz, బ్రైట్‌నెస్ 1000 నిట్స్ వరకు, స్క్రీన్ సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. స్టైల్‌తో పాటు భారీ స్క్రీన్‌ను కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్క్రోల్ చేసినా లేదా గేమింగ్ చేసినా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ :
ఒప్పో A5 5G ఫోన్ అతి బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌తో రోజంతా ఛార్జింగ్ వస్తుంది. 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. బ్యాటరీ కేవలం 21 నిమిషాల్లో 30శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

50శాతం ఛార్జింగ్ కేవలం 37 నిమిషాల్లో మాత్రమే పూర్తి అవుతుంది. ఈ బ్యాటరీ 1700 సార్లు ఛార్జ్ తర్వాత 80శాతం కన్నా ఎక్కువ కెపాసిటీని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ 5 ఏళ్ల పాటు మన్నికను అందిస్తుంది.

పర్ఫార్మెన్స్, స్టోరేజీ :
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌ను పొందవచ్చు. 6nm టెక్నాలజీపై వస్తుంది. 1072MHz వద్ద మాలి-G57 MC2 GPU కలిగి ఉంది. ఫోన్ గేమింగ్, HV టాస్కింగ్‌ స్పీడ్ ఉంటుంది. ర్యామ్ విషయానికి వస్తే.. 6GB ర్యామ్ కలిగి ఉంది.

వర్చువల్ ర్యామ్ 8GBకి పెంచుకోవచ్చు. 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. 1TB వరకు మైక్రో SD కార్డ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఒప్పో సొంత కలర్ OS స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.

కనెక్టివిటీ, నెట్‌వర్క్ సపోర్టు :
ఒప్పో A5 5G ఫోన్ డ్యూయల్ 5G VoLTE సపోర్ట్‌ను కలిగి ఉంది. NSA, SA నెట్‌వర్క్‌లకు సపోర్టు ఇస్తుంది. n1/n3/n5/n8/n28B/n40/n41/n77/n78 వంటి బ్యాండ్‌లను పొందవచ్చు. 5G కనెక్టివిటీ వేగంగా ఉంటుంది.

కెమెరా, ఫొటో క్వాలిటీ :
కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంది. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా కలిగి ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు బెస్ట్. కెమెరా యాప్ కూడా ఉంది.

Read Also : EPFO Passbook : మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. EPF పాస్‌బుక్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు.. పీఎఫ్ బ్యాలెన్స్ కూడా..!

వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, ధర :
ఒప్పో A5 5G ఫోన్ అరోరా గ్రీన్, మిస్ట్ వైట్ 2 కలర్ వేరియంట్లలో వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ రూ. 15,499కు లభిస్తుంది. రూ. 16,999 ధరకు 8GB ర్యామ్‌ వేరియంట్ కూడా పొందవచ్చు.
ప్రస్తుతం ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అతి త్వరలో ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులోకి రానుంది. మీరు 15వేల నుంచి రూ. 17 వేల కన్నా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఒప్పో A5 5G ఫోన్ కొనేసుకోవచ్చు.