Samsung Phones Price Hike : ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఈ శాంసంగ్ ఫోన్లు చాలా కాస్ట్‌లీ గురూ.. కొత్త ధరలు చూస్తే షాకవుతారు!

Samsung Phones Price Hike : శాంసంగ్ కొన్ని M, F సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా పెంచింది. ఇప్పుడు, శాంసంగ్ గెలాక్సీ F17 5G, శాంసంగ్ గెలాక్సీ A17 5జీ వంటి పలు వేరియంట్ల ధరలు కూడా పెరిగినట్టు కొత్త లీక్ వెల్లడించింది.

Samsung Phones Price Hike

  • లీకుల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ F17 5G ధర రూ.1,000 పెంపు
  • గెలాక్సీ A17 5జీ 3 వేరియంట్లపై ధరలు పెరిగినట్టు సమాచారం
  • ఫోన్ల ధరల పెంపుపై శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు

Samsung Phones Price Hike : శాంసంగ్ ఫ్యాన్స్ కు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. శాంసంగ్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. శాంసంగ్ M, F-సిరీస్‌లలో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను భారీగా పెంచేసింది. లీక్ డేటా ప్రకారం.. ఈ లిస్టులో మరిన్ని మోడళ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ F17 5జీ, శాంసంగ్ గెలాక్సీ A17 5జీ వంటి అనేక వేరియంట్‌ల ధరలు పెరిగినట్టు తెలుస్తోంది.

లీక్ డాక్యుమెంట్ ప్రకారం.. :
కొత్త ధరలు జూన్ 12, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. కంపెనీ ఇంకా అధికారిక (Samsung Phones Price Hike) ప్రకటన చేయలేదు. లీక్ డేటా ప్రకారం అనేక శాంసంగ్ మోడళ్ల ధరల వివరాలు రివీల్ అయ్యాయి. టిప్‌స్టర్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F17 5జీ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ A17 5జీ సిరీస్‌లో ఎంపిక చేసిన వేరియంట్ల కొత్త ధరలతో శాంసంగ్ రిటైల్ నోటీసు షేర్ చేశారు.

Read Also : Smartphones Price Hike : బాబోయ్.. భారీగా పెరగబోతున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఇప్పుడే కొనడం బెటరా..? నథింగ్ సీఈఓ ఏమన్నారంటే?

శాంసంగ్ గెలాక్సీ F17 5జీ ఫోన్ 4GB+128GB, 6GB+128GB, 8GB+128GB వేరియంట్ల ధరలు వెయ్యి వరకు పెరిగాయి. ఈ ధరలు ఇప్పుడు వరుసగా రూ. 18,999, రూ. 20,999, రూ. 22,999గా ఉన్నాయి.

ఏ మోడల్ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ A17 5జీ ఫోన్ 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB వేరియంట్ల ధరలు కూడా సుమారు రూ. 1,000 వరకు పెరిగాయి. నివేదికల ప్రకారం.. 6GB+128GB వేరియంట్ ధర రూ. 21,499 నుంచి రూ. 22,499కి, 8GB+128GB వేరియంట్ ధర రూ. 23,499 నుంచి రూ.24,499కి, 8GB+256GB వేరియంట్ ధర రూ. 27,999 నుంచి రూ.28,999కి పెరిగింది.

కొత్త ధరలు జూన్ 12, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ, ధరల పెంపుపై శాంసంగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో గెలాక్సీ F17 5జీ పాత ధరకు స్టాక్ లేదు. శాంసంగ్ గెలాక్సీ A17 5జీ మాత్రం పాత ధరకే అమ్ముడవుతోంది. అలాగే, ఈ రెండు ఫోన్‌లు అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే లిస్టు అయ్యాయి.