Samsung S24 Ultra 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ కేవలం రూ. 30,662కే.. డోంట్ మిస్!

Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర తగ్గింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ. 30,662కు సొంతం చేసుకోవచ్చు.

Samsung S24 Ultra 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ కేవలం రూ. 30,662కే.. డోంట్ మిస్!

Samsung S24 Ultra 5G

Updated On : April 11, 2025 / 6:32 PM IST

Samsung Galaxy S24 Ultra 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌తో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, క్వాడ్ కెమెరా సెటప్‌తో ఫోటోగ్రఫీ, అద్భుతమైన ఇమేజ్-ప్రొడ్యూసింగ్ పవర్‌ఫుల్ అమోల్డ్ ప్యానెల్, భారీ డిజైన్ వంటి అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

Read Also : Cheapest 5G Plans : ఎయిర్‌టెల్, జియో, Vi చీపెస్ట్ 5G ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా… OTT బెనిఫిట్స్ కూడా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

మీరు కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G డీల్‌ను మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. బ్యాంక్ ఆఫర్లతో ఈ 5జీ ఫోన్‌పై మరింత డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ 5జీ ఫోన్‌ రూ.30,662 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర రూ.92,099గా ఉంది. రూ.1,19,999 (శాంసంగ్ స్టోర్) ధర నుంచి భారీగా తగ్గింది. కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,762 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ 5G ఫోన్ ధర రూ.90వేల కన్నా తక్కువకు పొందవచ్చు.

కొనుగోలుదారులు నెలకు రూ.4,465 ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. వర్కింగ్ కండిషన్, డివైజ్ మోడల్ ఆధారంగా మీరు రూ. 46,100 తగ్గింపు ధరకు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో QHD+ రిజల్యూషన్‌తో కూడిన పవర్‌ఫుల్ 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, అల్ట్రా-స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో అవుట్‌డోర్ విజిబిలిటీ ఉన్నాయి. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్ కోసం 12GB వరకు స్పీడ్ (LPDDR5X) ర్యామ్ అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీపై రన్ అవుతుంది.

Read Also : iQOO Z10 Series : అదిరే ఫీచర్లతో ఐక్యూ Z10 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర కూడా తక్కువే..!

బ్యాటరీ ఛార్జింగ్ కోసం 45W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో 200MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని మల్టీఫేస్ క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉంది. 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 10MP 3x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ క్లారిటీ ఫొటోల కోసం 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.