Cheapest 5G Plans : ఎయిర్‌టెల్, జియో, Vi చీపెస్ట్ 5G ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా… OTT బెనిఫిట్స్ కూడా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Cheapest 5G Plans : ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా 5జీ డేటా ప్లాన్లను సరసమైన ధరకే ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో మీరు ఏ ప్లాన్ ఎంచుకున్నా అన్‌లిమిటెడ్ 5G హైస్పీడ్ డేటాతో పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ కూడా పొందొచ్చు.

Cheapest 5G Plans
Cheapest 5G Plans : ప్రస్తుత రోజుల్లో మొబైల్ డేటా వినియోగం ఎక్కువగా పెరిగింది. ప్రతిఒక్కరూ డేటా బెనిఫిట్స్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. అందులోనూ 5G డేటా ప్లాన్లకు ఫుల్ డిమాండ్. అంతేకాదు.. OTT బెనిఫిట్స్ పొందవచ్చు. దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా (Vi) ఇప్పుడు అన్‌లిమిటెడ్ 5G డేటాతో సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 5G సర్వీసులను విస్తరిస్తున్న ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా(Vi) ఇప్పుడు ఫ్రీ అన్‌లిమిటెడ్ 5G డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్, జియో కొంతకాలంగా ఇలాంటి ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా ఇటీవలే ముంబైలో 5G సర్వీసును ప్రారంభించింది. అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్, ఫెయిర్ యూసేజ్ పాలసీస్ (FUP)తో ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రూ. 379 ఎయిర్‌టెల్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ కస్టమర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించే ఎయిర్‌టెల్ బేస్ ప్లాన్ రూ. 379 నుంచి ప్రారంభమవుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, 30 రోజుల వ్యాలిడిటీ కోసం 2GB రోజువారీ డేటా (60GB)తో వస్తుంది. రోజువారీ కోటా ముగిసిన తర్వాత డేటా స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది.
ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ యాడ్-ఆన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 3 నెలల పాటు ఫ్రీ అపోలో 24/7 సర్కిల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్ యాక్సెస్, నెలకు ఒక ఫ్రీ హెలోట్యూన్, VoLTE సపోర్టు, ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ వంటివి యాక్సస్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G ఫెయిర్ యూజ్ పాలసీతో వస్తుంది. ఒక యూజర్ 30 రోజుల్లో 300GB 5G వినియోగాన్ని మించితే నెట్‌వర్క్ కమర్షియల్ యూజ్ అనే ఫ్లాగ్ చేయవచ్చు. బేస్ ప్లాన్ డేటా అన్ని నెట్‌వర్క్ టైప్‌లలో వర్క్ అవుతుంది.
రూ.349 జియో ప్లాన్ :
జియో ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ.349 అత్యంత చౌకైనది. అన్‌లిమిటెడ్ వాయిస్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటా (మొత్తం 56GB) 28 రోజుల పాటు అందిస్తోంది. అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ అర్హత కలిగిన 5G యూజర్లకు మాత్రమే. ఈ ప్లాన్‌లో JioTV, JioAICloud (50GB ఫ్రీ స్టోరేజీతో) స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి.
ఐపీఎల్ 2025 ఆఫర్ కింద 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ యాక్సస్ పొందవచ్చు. మీ ప్లాన్ గడువు ముగిసిన 48 గంటలలోపు రీఛార్జ్ చేసుకుంటే ఈ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియో 5G ప్లాన్ ఎలాంటి డేటా లిమిట్ లేదు. హాట్‌స్పాట్ వినియోగానికి కూడా ఎలాంటి లిమిట్స్ లేవు.
రూ.299 Vi ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా (Vi) అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్ రూ. 299 నుంచి అందుబాటులో ఉంది. రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్, 28 రోజుల పాటు రోజుకు 100 SMS అందిస్తుంది. 5G బెనిఫిట్స్ ప్రస్తుతం ముంబై వినియోగదారులకే పరిమితమని గమనించాలి.
అయితే, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌తో సహా మరిన్ని సర్కిల్‌లు త్వరలో 5జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వోడాఫోన్ ఐడియా Vi గ్యారెంటీ ద్వారా 130GB వరకు బోనస్ డేటాను అందిస్తుంది. 4Gలో మాత్రమే డేటాను ఉపయోగించవచ్చు.
వోడాఫోన్ ఐడియా (FUP) 28 రోజుల్లో 300GB వరకు 5G డేటాను వినియోగించవచ్చు. అంతకు మించితే డేటా స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. భారతీయ వినియోగదారులు రోజుకు దాదాపు రూ.10 నుంచి రూ. 13 ఖర్చుతో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. జియో, ఎయిర్‌టెల్ కవరేజీలో ముందంజలో ఉండగా, వోడాఫోన్ ఐడియా ధర, 5జీ మార్కెట్‌లోకి ప్రవేశించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది.