iQOO Z10 Series : అదిరే ఫీచర్లతో ఐక్యూ Z10 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర కూడా తక్కువే..!

iQOO Z10 Series : ఐక్యూ నుంచి సరికొత్త Z10 సిరీస్ వచ్చేసింది. ఐక్యూ Z10, ఐక్యూ Z10x సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయ్యాయి. ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

iQOO Z10 Series : అదిరే ఫీచర్లతో ఐక్యూ Z10 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర కూడా తక్కువే..!

iQOO Z10 Series

Updated On : April 11, 2025 / 5:31 PM IST

iQOO Z10 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐక్యూ నుంచి సరికొత్త Z10 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఐక్యూ Z10, ఐక్యూ Z10x సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యాయి.
ఈ సెగ్మెంట్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ భారీ బ్యాటరీలతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఐక్యూ Z10 అతిపెద్ద 7,300mAh బ్యాటరీ ఉండగా, ఐక్యూ Z10x 6,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఐక్యూ Z10, ఐక్యూ Z10x ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Hyundai Exter EX CNG : కొత్త కారు భలే ఉందిగా.. డ్యూయల్ సిలిండర్‌తో హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG ఇదిగో.. ధర కూడా చాలా తక్కువే..!

భారత్‌లో ఐక్యూ Z10 ధర, ఆఫర్లు :
ఐక్యూ Z10 ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 వేర్వేరు వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ. 21,999కు లభిస్తోంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999కు పొందవచ్చు.

12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 25,999కు పొందవచ్చు. ఐక్యూ కస్టమర్లు రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఏప్రిల్ 16 నుంచి ఈ ఫోన్ అమ్మకానికి వస్తుంది.

భారత్‌‌‍లో ఐక్యూ Z10x ధర, ఆఫర్లు :
ఐక్యూ Z10x ఫోన్ అల్ట్రామెరైన్, టైటానియం కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ 3 కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,499 కాగా, 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ. 14,999కు లభిస్తోంది.

8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ. 16,499కు పొందవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఏప్రిల్ 22 నుంచి ఈ ఐక్యూ Z10 సిరీస్ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ఐక్యూ Z10 స్పెసిఫికేషన్లు :
ఐక్యూ Z10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను అందిస్తుంది. హుడ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు (LPDDR4X) ర్యామ్, 256GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 7,300mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ వై-ఫై 2.4GHz/5GHz, బ్లూటూత్ 5.2, జీపీఎస్, OTG సపోర్ట్, USB 2.0 (టైప్-C పోర్ట్)ను అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌ను పొందింది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా కూడా ఉంది.

ఐక్యూ Z10x స్పెసిఫికేషన్లు :
ఐక్యూ Z10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ నుంచి 8GB (LPDDR4X) ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Cheapest 5G Plans : ఎయిర్‌టెల్, జియో, Vi చీపెస్ట్ 5G ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా… OTT బెనిఫిట్స్ కూడా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే… ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 2MP సెకండరీ షూటర్‌ను అందిస్తుంది. సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.