Samsung Galaxy S24 Ultra : కొంటే ఇలాంటి శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ 5G ఫోన్ క్రేజ్ తెలిస్తే కొనేవరకు ఉండలేరు..!
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ఫోన్ తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..

Samsung Galaxy S24 Ultra 5G
Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్ తర్వాత గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ భారీగా తగ్గింది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ధర తగ్గింపు మాత్రమే కాదు.. బ్యాంక్ డిస్కౌంట్లతో కూడా కస్టమర్‌లు రూ.26,432 కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
Read Also : Vivo V50 Elite Edition : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!
ఈ శాంసంగ్ ఫోన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే, పెరిస్కోప్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్, ఏఐ ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర ఎంత తగ్గిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర రూ. 87,965కు లిస్టింగ్ అయింది. రూ. 1,09,999 (స్టోర్ ధర) నుంచి తగ్గింది. అదనంగా, కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ధరను 5 శాతం తగ్గించవచ్చు.
ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై ధర రూ. 84వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయొచ్చు.
మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే.. వర్కింగ్ కండిషన్, మోడల్ బ్రాండ్‌ను బట్టి ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పై బెస్ట్ ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తుంది.
తద్వారా శాంసంగ్ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. కస్టమర్లు అదనపు చెల్లించడం ద్వారా మొత్తం మొబైల్ ప్రొటెక్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది, 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది.
Read Also : Samsung Galaxy S25 : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ మొత్తం 4 కెమెరాలతో వస్తుంది. ఇందులో 200MP మెయిన్ సెన్సార్, 50MP 5x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.