Samsung Galaxy S25 : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!

Samsung Galaxy S25 : ఆఫర్ అదిరింది భయ్యా.. శాంసంగ్ గెలాక్సీ S25 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25 : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!

Samsung Galaxy S25

Updated On : May 15, 2025 / 5:05 PM IST

Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25 పై లిమిటెట్ పీరియడ్ ఆఫర్‌ను అధికారికంగా ప్రకటించింది.

Read Also : Pixel 10 Pro vs Pixel 9 Pro : పిక్సెల్ 10ప్రో సిరీస్ వస్తోంది.. పిక్సెల్ 9ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో.. ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చంటే?

జనవరి 2025లో రూ.74,999 ధరకు లాంచ్ అయిన ఈ శాంసంగ్ ఫోన్ పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్‌లు, మెరుగైన కెమెరాతో పాటు అనేక ఏఐ ఫీచర్‌లను కూడా అందిస్తోంది. మీరు శాంసంగ్ గెలాక్సీ S25 కొనుగోలుపై భారీ ధర తగ్గింపు, అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర, ఆఫర్లు :
కంపెనీ గెలాక్సీ S25 పై రూ.11వేల అప్‌గ్రేడ్ బోనస్‌ను అందిస్తోంది. 12GB/128GB వేరియంట్ ధరను రూ.74,999 నుంచి రూ.63,999కి తగ్గిస్తోంది. కస్టమర్లు తమ కొనుగోలుపై రూ.10వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

శాంసంగ్ ఫోన్ ఆఫర్లు (Samsung.com), ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, భారత్ అంతటా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు రూ. 8వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో 9 నెలల నో-కాస్ట్ EMI లేదా NBFC ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 6.7-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. HDR10+ సపోర్ట్‌తో పాటు 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

హుడ్ కింద ఈ శాంసంగ్ ఫోన్ 12GB వరకు LPDDR5 ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత One UI 7పై రన్ అవుతుంది. ఏడు ఏళ్ల OS అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ ప్రోవిజువల్ ఇంజిన్, గేమింగ్ కోసం వల్కాన్ ఇంజిన్, రే ట్రేసింగ్ సపోర్ట్, వీడియోలలో సౌండ్ కంట్రోలింగ్ కోసం ఆడియో ఎరేజర్‌తో వస్తుంది.

Read Also : Vivo V50 Elite Edition : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

కెమెరాల విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP వెడల్పు, 12MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌లతో సహా ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.