Pixel 10 Pro vs Pixel 9 Pro : పిక్సెల్ 10ప్రో సిరీస్ వస్తోంది.. పిక్సెల్ 9ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో.. ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చంటే?
Pixel 10 Pro vs Pixel 9 Pro : అతి త్వరలో కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ రాబోతుంది. పిక్సెల్ 10 ప్రో లాంచ్ కానుంది.

Pixel 10 Pro vs Pixel 9 Pro
Pixel 10 Pro vs Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. గూగుల్ నెక్స్ట్ మేడ్ బై గూగుల్ ఈవెంట్ ఆగస్టు 2025లో జరుగనుంది.
Read Also : iQOO Neo 10 Price : ఐక్యూ నియో 10 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు ఇవేనా?
ఇందులో పిక్సెల్ 10 సిరీస్‌ను ప్రవేశపెడుతుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో పిక్సెల్ 10 ప్రో, స్టాండర్డ్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌తో సహా 4 మోడళ్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రాబోయే స్మార్ట్‌ఫోన్‌లపై అధికారిక వివరాలు రివీల్ చేయనప్పటికీ గత ఏడాది పిక్సెల్ 9 సిరీస్ కన్నా కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉంది.
పిక్సెల్ 10 ప్రో డిస్‌ప్లే బ్రైట్‌నెస్, ఛార్జింగ్ సామర్థ్యం, ప్రాసెసర్ పరంగా ముందంజలో ఉంటుందని చెబుతున్నారు. పిక్సెల్ 9 ప్రో కన్నా పిక్సెల్ 10 ప్రో ఏయే అప్‌గ్రేడ్ ఫీచర్లతో రానుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పిక్సెల్ 10 ప్రో vs పిక్సెల్ 9 ప్రో డిజైన్ :
పిక్సెల్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన డిజైన్ ఓవర్‌హాల్ పొందింది. పిక్సెల్ 9 XL సైజు కూడా తగ్గింది. ఈ పిక్సెల్ 9 ఫోన్ పిక్సెల్ 8 ప్రో కన్నా బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్, ట్విస్టెడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో కూడిన 6.3-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది.
ఈ ఏడాదిలో రాబోయే పిక్సెల్ 10 ప్రో బ్యాక్ సైడ్ ఎండ్ కొత్త గొరిల్లా గ్లాస్ సిరామిక్-ప్రొటెక్టెడ్ డిస్‌ప్లేతో సహా కొన్ని స్మాల్ ట్వీక్‌లతో డిజైన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పిక్సెల్ 9 ఫోన్ దాదాపు 1 మిమీ వరకు కొంచెం మందంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు.
పిక్సెల్ 10 ప్రో vs పిక్సెల్ 9 ప్రో డిస్‌ప్లే :
ఈ ఏడాదిలో గూగుల్ పిక్సెల్ 10 ప్రోకి కీలక అప్‌గ్రేడ్ రానుందని భావిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ అప్‌గ్రేడ్ పెండింగ్‌లో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 9 ప్రో కన్నా ఎక్కువ PWM డిమ్మింగ్‌ను పొందవచ్చు. స్క్రీన్ ఫ్లికరింగ్‌ను తగ్గిస్తుంది. పిక్సెల్ 10 ప్రో గత వెర్షన్‌కు సమానంగా ఉంటుందని అంచనా.
పిక్సెల్ 10 ప్రో vs పిక్సెల్ 9 ప్రో పర్ఫార్మెన్స్ :
ఒకే ప్రాసెసర్ ఉన్నా గూగుల్ పిక్సెల్ 9 ప్రో కన్నా పిక్సెల్ 10 ప్రో మెరుగ్గానే రన్ అవుతుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ TSMC 3nm ప్రాసెసర్ ఆధారంగా టెన్సర్ G5తో వస్తుంది.
గత ఏడాదిలో టెన్సర్ G4 కన్నా వేగంగా రన్ అవుతుంది. పిక్సెల్ 10 ప్రోలో పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ చేయొచ్చు. అయితే, ర్యామ్ పిక్సెల్ 9 ప్రో మాదిరిగానే 16GBగా ఉంటుందని భావిస్తున్నారు.
పిక్సెల్ 10 ప్రో vs పిక్సెల్ 9 ప్రో కెమెరాలు :
కెమెరా పరంగా పరిశీలిస్తే.. పిక్సెల్ 9 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఆకట్టుకుంటుంది. పిక్సెల్ 10 ప్రో అదే 50MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రావైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం గూగుల్ ఏఐ ఫీచర్‌లను ఉపయోగించవచ్చు.
పిక్సెల్ 10 ప్రో vs పిక్సెల్ 9 ప్రో బ్యాటరీ :
పిక్సెల్ 10 ప్రో పిక్సెల్ 9 ప్రో మాదిరిగానే 4,700mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఛార్జింగ్ కెపాసిటీ అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో పిక్సెల్ 9 ప్రో 27W ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుందని భావిస్తున్నారు.
పిక్సెల్ 10 ప్రో vs పిక్సెల్ 9 ప్రో ధర :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ.1,09,999 నుంచి ప్రారంభమయ్యే బేస్ వేరియంట్‌తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర కూడా దాదాపు రూ.1,10,000 నుంచి ఉంటుందని అంచనా.