Vivo V50 Elite Edition : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

Vivo V50 Elite Edition : వివో కొత్త ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్ ధరలోనే వివో V50 ఎలైట్ ఎడిషన్ కొనేసుకోవచ్చు.

Vivo V50 Elite Edition : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. మీ బడ్జెట్ ధరలోనే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోండి..!

Vivo V50 Elite Edition

Updated On : May 15, 2025 / 4:31 PM IST

Vivo V50 Elite Edition : వివో ఫ్యాన్స్ కోసం కొత్త ఫోన్ తీసుకొచ్చింది. వివో ఇండియా అధికారికంగా V50 ఎలైట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. వివో V50 సిరీస్ అప్‌గ్రేడ్ వేరియంట్‌గా వస్తుంది.

Read Also : PF Pension : PF ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే? ఫుల్ డిటెయిల్స్..!

ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, ZEISSతో కలిసి ఇంజనీరింగ్ మెరుగైన కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. మే 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ ఛానల్ పార్టనర్లతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్, ప్రొటెక్టివ్ కేస్, వివో TWS 3e డార్క్ ఇండిగోను పొందవచ్చు.

ఈ వివో ఫోన్ డైమండ్ షీల్డ్ గ్లాస్, IP68/IP69 రేటింగ్‌లతో వస్తుంది. డ్రాప్-రెసిస్టెంట్, వాటర్-రెసిస్టెంట్‌గా చేస్తుంది. వివో V50 ఎలైట్ ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్, ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను ఓసారి లుక్కేయండి.

వివో V50 ఎలైట్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు :
వివో V50 ఎలైట్ ఎడిషన్ 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఈ వివో ఫోన్ 12GB వరకు LPDDR5 ర్యామ్, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. వివో V50 ఎలైట్ ఎడిషన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది.

ఈ ఫోన్ ఏఐ-ఆధారిత టూల్స్‌తో వస్తుంది. ఇందులో ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, సిగ్నల్ క్వాలిటీ కోసం ఏఐ సూపర్‌లింక్, ఫొటో అప్‌గ్రేడ్ కోసం ఏఐ ఎరేజర్ 2.0 ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ OIS, అల్ట్రా-వైడ్, గ్రూప్ సెల్ఫీలతో కూడిన 50 MP ZEISS ఆల్-మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇందులో ZEISS మల్టీఫోకల్ పోర్ట్రెయిట్స్ (23mm, 35mm, 50mm), ఏడు ZEISS పోర్ట్రెయిట్ స్టైల్స్, ఇండియా-ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రెయిట్ స్టూడియో ఉన్నాయి.

Read Also : Pixel 10 Pro vs Pixel 9 Pro : పిక్సెల్ 10ప్రో సిరీస్ వస్తోంది.. పిక్సెల్ 9ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో.. ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చంటే?

వివో V50 ఎలైట్ ఎడిషన్ ధర, ఆఫర్లు :
వివో V50 ఎలైట్ ఎడిషన్ రూ.41,999 ధరకు లభిస్తుంది. వినియోగదారులు HDFC, SBI, Axis బ్యాంక్ కార్డులతో 3,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు లేదా రూ.3వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఈ వివో ఫోన్ 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో వస్తుంది.