×
Ad

Samsung Galaxy Z Fold 6 : కిర్రాక్ డిస్కౌంట్ భయ్యా! ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ధర తగ్గిందోచ్.. ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ. 65వేల తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Samsung Galaxy Z Fold 6 (Image Credit to Original Source)

  • భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ప్రారంభ ధర రూ.1,64,999
  • ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూ.1,09,999కి లభ్యం
  • రూ.55,000 డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో మరింత ఆదా

Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మీరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. అత్యంత ఖరీదైన శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ఇప్పడు అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 రూ. 65వేల భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.

భారత మార్కెట్లో రూ. 1,64,999 ప్రారంభ ధరకు లాంచ్ కాగా డ్యూయల్ అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సిస్టమ్, ప్రీమియం బిల్డ్‌తో వస్తుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలుపై ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే అతి తక్కువ ధరకే ఈ ఫోల్డ్ ఫోన్ కొనేసుకోవచ్చు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ధర తగ్గింపు :

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ప్రారంభ ధర రూ.1,64,999తో లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ.1,09,999కి లిస్ట్ అయింది. అంటే.. మీరు ఇక్కడ నేరుగా రూ.55వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. అమెజాన్ రూ.5వేల విలువైన కూపన్‌ను కూడా అందిస్తోంది.

Read Also : Google Pixel 10 Price : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ డీల్ ఎందుకు బెటర్?

హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ పేమెంట్లపై మీరు అదనంగా రూ.5వేలు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడింగ్ చేస్తే మోడల్, కండిషన్‌ను బట్టి ఏకంగా రూ.44,300 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Fold 6 (Image Credit to Original Source)

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 4400mAh డ్యూయల్ బ్యాటరీ ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 7.6-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్స్ ఉన్నాయి.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.