Google Pixel 10 Price : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ డీల్ ఎందుకు బెటర్?

Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ 10 ధర తగ్గిందోచ్.. గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 Price : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ డీల్ ఎందుకు బెటర్?

Google Pixel 10 Price (Image Credit to Original Source)

Updated On : January 1, 2026 / 5:17 PM IST
  • భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999
  • అమెజాన్ రూ.9,600 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది
  • మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌తో రూ.44,300 వరకు సేవింగ్
  • గూగుల్ పిక్సెల్ 10 ధర రూ.70,399 లభ్యం

Google Pixel 10 Price : కొత్త గూగుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. భారతీయ మార్కెట్లో రూ.79,999కి లాంచ్ అయిన ఈ పిక్సెల్ 10 ఫోన్ ఇప్పుడు రూ.9వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

గూగుల్ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్ ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు. సాధారణంగా లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఈ పిక్సెల్ ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ధర తగ్గింపు :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్ ఇప్పుడు రూ.9,600 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ధర రూ.70,399కి తగ్గింది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసి మోడల్ కండిషన్‌ బట్టి రూ.44,300 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Google Pixel 10 Price

Google Pixel 10 Price  (Image Credit to Original Source)

Read Also : Best OnePlus Phones : కొంటే వన్‌ప్లస్ ఫోన్ కొనాలి.. రూ.40 వేల లోపు ధరలో 5 బెస్ట్ వన్‌ప్లస్ ఫోన్లు.. ఫీచర్ల కిర్రాక్ అంతే..

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,970mAh బ్యాటరీ అందిస్తోంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల OLED స్క్రీన్‌ అందిస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.

కెమెరా సెక్షన్ పరంగా చూస్తే.. పిక్సెల్ 10లో మాక్రో ఫోకస్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.