Samsung Vision AI TV : కొత్త శాంసంగ్ టీవీ అదుర్స్.. పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లు, భారీ డిస్‌ప్లేతో 2026 విజన్ ఏఐ టీవీ!
Samsung Vision AI TV : శాంసంగ్ 2026 విజన్ ఏఐ టీవీ లైనప్‌ను లాంచ్ చేసింది. ఇందులో మైక్రో ఆర్జీబీ, ఓఎల్ఈడీ,నియో క్యూఎల్ఈడీ, ది ఫ్రేమ్, మినీ ఎల్ఈడీ యూహెచ్‌డీ టీవీలు ఉన్నాయి. పూర్తి ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- May 27, 2026 / 02:00 PM IST
Samsung Vision AI TV
- శాంసంగ్ మైక్రో ఆర్జీబీ టీవీ ధర రూ. 1,24,990 నుంచి ప్రారంభం
- శాంసంగ్ OLED టీవీ ధర రూ. 1,14,990 నుంచి
- శాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ ధర రూ. 56,990గా ఉంది
Samsung Vision AI TV : కొత్త శాంసంగ్ స్మార్ట్ టీవీ కొంటున్నారా? శాంసంగ్ 2026 విజన్ ఏఐ టీవీ లైనప్‌ను లాంచ్ చేసింది. ఇందులో మైక్రో ఆర్‌జీబీ, ఓఎల్‌ఇడీ, నియో క్యూఎల్‌ఇడీ, ది ఫ్రేమ్, మినీ ఎల్‌ఇడీ, యుహెచ్‌డీ టీవీలు ఉన్నాయి. శాంసంగ్ అన్ని మోడళ్లలో ఏఐ-ఆధారిత ఫీచర్లను అందిస్తోంది.
తద్వారా యూజర్లకు మెరుగైన ఫొటో, సౌండ్, కస్టమైజడ్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ (Samsung Vision AI TV) అందిస్తోంది. శాంసంగ్ 4K టీవీ అంతకంటే ఎక్కువ టీవీ లైనప్‌లోని విజన్ ఏఐ కంపానియన్ (VAC) ఫీచర్ యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తోంది. శాంసంగ్ 2026 విజన్ ఏఐ టీవీకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ 2026 విజన్ ఏఐ టీవీ ధర ఎంతంటే? :
శాంసంగ్ మైక్రో ఆర్జీబీ టీవీ ధర రూ. 1,24,990 నుంచి ప్రారంభమవుతుంది. ఓఎల్ఈడీ టీవీ ధర రూ. 1,14,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 56,990గా ఉంది. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీ ధర రూ. 52,990, మినీ ఎల్ఈడీ టీవీ ధర రూ. 42,990,UHD టీవీ ధర రూ. 36,990గా ఉన్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా శాంసంగ్ లిమిటెడ్ టైమ్ అనేక బెనిఫిట్స్ అందిస్తోంది.
Read Also : Oakter Studio AC 5000 : రూ.14,499కే ఓక్టర్ కొత్త AC తెచ్చుకోండి.. ఫాస్ట్ కూలింగ్, తక్కువ పవర్ బిల్లు..!
ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 1,02,990 విలువైన ఫ్రీ సౌండ్‌బార్, రూ. 23,990 విలువైన ఫ్రీ మ్యూజిక్ స్టూడియో, 20శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ లభిస్తున్నాయి. శాంసంగ్ 2026 విజన్ ఏఐ టీవీ లైనప్ భారత మార్కెట్లో శాంసంగ్ రిటైల్ స్టోర్‌లు, శాంసంగ్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
శాంసంగ్ 2026 విజన్ ఏఐ టీవీ ఫీచర్లు :
విజన్ ఏఐ కంపానియన్ (VAC) అనేది శాంసంగ్ ఏఐ సర్వీస్ ప్లాట్‌ఫామ్ బిక్స్‌బీ, పెర్‌ప్లెక్సిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్‌లతో టీవీ చూసే ఎక్స్‌పీరియన్స్ మరింత పర్సనలైజడ్ చేస్తుంది. శాంసంగ్ విజన్ ఏఐ కంపానియన్, ఏమి చూడాలి? ఏమి తినాలి? ఏమి వినాలి? అనే విషయాలపై యూజర్లకు గైడ్ చేసేలా ఈ స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఏఐ టీవీ లైనప్, సినిమాలు, క్రీడలు, గేమింగ్‌తో సహా అన్ని రంగాలలో ఏఐ-ఆధారిత ఎంటర్‌టైన్మెంట్ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో, లో రిజల్యూషన్ కంటెంట్ రియల్ టైమ్ యనలైజ్ చేయగలదు. తద్వారా డీప్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. కలర్ బూస్టర్ ప్రో, రియల్ కలర్ విజువల్స్‌ను విశ్లేషించి కస్టమైజ్ చేస్తుంది.
ఏఐ సాకర్ మోడ్, మూవీ సౌండ్ ఆప్టిమైజ్ కోసం మ్యాచ్ విజువల్స్‌ను రియల్ టైమ్ విశ్లేషిస్తుంది. ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో, కన్వర్జేషన్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లను రియల్ టైమ్ యనలైజ్ చేస్తుంది. తద్వారా యూజర్లు కామెంటరీ ఆడియెన్స్ సౌండ్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
