Save 100 Daily SIP : జీతం తక్కువైనా పర్లేదు.. రోజుకు రూ.100 సేవింగ్ చేస్తే చాలు.. లక్షాధికారి అవ్వొచ్చు.. పూర్తి లెక్కలివే!

Save 100 Daily SIP : రోజుకు కేవలం రూ.100 ఆదా చేసి నెలకు రూ.3వేలు SIPలో పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ.15 లక్షలకు పైగా రాబడి సంపాదించుకోవచ్చు.. అది ఎలాగో పూర్తి లెక్కలతో తెలుసుకుందాం..

Save 100 Daily SIP

  • 15 ఏళ్లలో రూ.15 లక్షలకు పైగా మీ సొంతం
  • ఖర్చుల్లో చిన్న మార్పు.. భవిష్యత్తులో రూ.15 లక్షల భారీ రాబడి
  • రోజుకు రూ.100 పెట్టుబడి పెడితే ఎంతొస్తుందో తెలుసా?

Save 100 Daily SIP : చేతికి అందిన జీతం వెంటనే ఖర్చు అయిపోతుందా? చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఎంత సంపాదించినా సేవింగ్ చేయలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు. నెల జీతం వచ్చిన కొద్ది రోజులకే ఖర్చులన్నీ అయిపోతుంటాయి.

ఇక పొదుపు, పెట్టుబడుల గురించి ఆలోచించేందుకు చేతిలో డబ్బులు ఎక్కడుంటాయని అనుకుంటారు. కానీ, రోజుకు కేవలం రూ.100 పక్కన పెట్టినా భవిష్యత్తులో మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చని మీకు తెలుసా?

సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుని, ఓపికగా కొనసాగిస్తే.. చిన్న మొత్తంతోనే భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకోవచ్చు.. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ద్వారా 15ఏళ్లలో రూ. 15 లక్షలకు పైగా రాబడిపైనే రాబడిని సంపాదించుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

రోజుకు రూ.100.. నెలకు రూ.3,000 :
రోజుకు రూ.100 ఆదా చేస్తే నెలకు దాదాపు రూ.3,000 అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా ఒక మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెడితే కాలక్రమంలో మంచి కార్పస్ పొందవచ్చు.. ఉదాహరణకు, ప్రతి ఏడాది సగటున 12 శాతం రాబడి వస్తుందని అంచనాతో ఎంతవరకు పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం..

5 ఏళ్లలో నెలకు రూ.3వేలు చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం రూ.1.80 లక్షలు జమవుతుంది. అంచనా రాబడి రూ.1.22 లక్షలు అవుతుంది. మొత్తం ఫండ్ వాల్యూ సుమారు రూ.3.02 లక్షలు అవుతుంది.

10 ఏళ్లలో మీ పెట్టుబడి రూ.3.60 లక్షలు అవుతుంది. అంచనా రాబడి రూ.2.90 లక్షలు ఉంటుంది. దాంతో మొత్తంగా కార్పస్ సుమారు రూ.6.50 లక్షలు వస్తుంది.

Read Also : Best Camera Phones : వావ్.. రూ.20 వేలలో అదిరిపోయే కెమెరా ఫోన్లు.. ఈ 4 ఫోన్లతో ఫొటోలు, వీడియోలు ఇరగదీయొచ్చు!

15 ఏళ్లలో పెట్టుబడి రూ.5.40 లక్షలు అవుతుంది. అంచనా రాబడి రూ.10.32 లక్షలు ఉంటుంది. మొత్తం ఫండ్ సుమారు రూ.15.72 లక్షలకు చేరుతుంది.

కాంపౌండింగ్ మ్యాజిక్ :
మొదట్లో పెట్టుబడిపై వచ్చే లాభం తక్కువగానే కనిపించినా, సమయం గడిచేకొద్దీ సంపాదించిన రాబడిపై కూడా రాబడి రావడం మొదలవుతుంది. దీనినే కాంపౌండింగ్ అంటారు. అందుకే పెట్టుబడి పెట్టే మొత్తం కన్నా ఎంతకాలం కొనసాగిస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం అనమాట..

అయితే, ఈ లెక్కలన్నీ 12 శాతం వార్షిక రాబడి అంచనాలు మాత్రమే. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. రాబడికి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి..

  • రోజుకు రూ.100 సేవ్ చేస్తే నెలకు రూ.3వేలు పెట్టుబడి పెట్టొచ్చు
  • SIP ద్వారా చిన్న మొత్తాలతోనూ పెట్టుబడి స్టార్ట్ చేయొచ్చు
  • 5 ఏళ్లలో సుమారు రూ.3.02 లక్షల ఫండ్ సేవ్ చేస్తారు అంచనా
  • 15 ఏళ్లలో సుమారు రూ.15.72 లక్షల కార్పస్ మీ చేతికి వస్తుంది