Maruti Suzuki Cars
Maruti Suzuki Cars 2026 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ మార్చి నెలలో కొత్త కారు కొనేవారికి బడ్జెట్ ధరలోనే కారు సొంతం చేసుకోవచ్చు. దేశీయ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కొన్ని కార్లపై రూ. 50,000 వరకు బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.
మార్చి 10, 2026న లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. స్విఫ్ట్, బ్రెజ్జా, వ్యాగన్ఆర్ వంటి మారుతి కార్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. సరసమైన ధరలో మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ ఆఫర్ అద్భుతమైన అవకాశం. ప్రతి మారుతి కారుపై డిస్కౌంట్లు, కొత్త ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి స్విఫ్ట్, బ్రెజ్జాలపై అదిరే ఆఫర్లు :
ఈ నెలలో మారుతి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ గరిష్టంగా రూ. 50వేల వరకు ఆదా చేసుకోవచ్చు. స్పీడ్, మైలేజీకి పేరుగాంచిన ఈ కారు ఇప్పుడు మరింత బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో రారాజు అయిన మారుతి బ్రెజ్జా కూడా రూ. 45వేల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది.
బ్రెజ్జా బేస్ మోడల్ (LXI)పై రూ. 10వేలు మాత్రమే డిస్కౌంట్ అందిస్తోంది. అయితే అన్ని ఇతర వేరియంట్‌లు భారీ డిస్కౌంట్‌లతో లభిస్తున్నాయి. కొత్త, అప్‌డేటెడ్ బ్రెజ్జా మోడల్ అతి త్వరలో భారత మార్కెట్లోకి రాబోతోంది. పాత స్టాక్‌పై మాస్టర్‌స్ట్రోక్ డీల్‌గా నిలుస్తోంది.
ఎర్టిగా, డిజైర్ :
మార్చిలో దేశంలో అత్యంత పాపులర్ పొందిన 7-సీట్ల కారు మారుతి ఎర్టిగాపై రూ. 5వేల వరకు ఆదా చేయవచ్చు. ఎర్టిగాకు హై డిమాండ్, వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ కంపెనీ ఈ బెనిఫిట్స్ వినియోగదారులకు అందిస్తోంది.
2025లో అత్యధికంగా అమ్ముడైన సెడాన్ అయిన మారుతి డిజైర్ రూ. 2,500 తగ్గింపుతో లభ్యమవుతోంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్, అద్భుతమైన బూట్ స్పేస్ కోరుకునే వారికి డిజైర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రెండు కార్లు మార్కెట్లో అత్యధిక రీసేల్ వాల్యూను అందిస్తున్నాయి.
వ్యాగన్ ఆర్, సెలెరియో, ఈకో :
మిడిల్ క్లాసు ఫ్యామిలీల కోసం మారుతి వ్యాగన్ ఆర్, సెలెరియో రూ.42,500 వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. వ్యాగన్ ఆర్ వైడ్ క్యాబిన్ అద్భుతంగా ఉంటుంది. అయితే సెలెరియో డ్రైవింగ్, కాంపాక్ట్ డిజైన్‌కు బెస్ట్ ఆప్షన్.
అదనంగా, కమర్షియల్ వెహికల్స్, బిగ్ ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోయే మారుతి ఈకో (పెట్రోల్, CNG) గరిష్టంగా రూ. 42,500 సేవింగ్స్ కూడా అందిస్తుంది. ఈకో కారును అంబులెన్స్, వ్యాన్‌గా తెగ వాడేస్తున్నారు.