SBI FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. SBIలో 211 రోజుల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

SBI FD Interest Rates : ఎస్బీఐ సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. 6 నెలలు లేదా 211 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలపై లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

SBI FD Interest Rates

  • 211 రోజుల ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే
  • ఎస్బీఐ ఫిక్స్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీ ఎంత?
  • సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీతో ఎఫ్‌డీ అకౌంట్లు

SBI FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (State Bank Of India) అనేక టెన్యూర్లతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై భారీ వడ్డీని అందిస్తోంది. ముఖ్యంగా, సాధారణ కస్టమర్లతో పోలిస్తే 60 ఏళ్లు, ఆపై ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు భారీ వడ్డీ రేట్లను పొందుతారు.

మీరు ఎస్‌బిఐలో 6 నెలల లేదా 211 రోజుల ఎఫ్‌డీని ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. ఈ టెన్యూర్ అందించే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? మెచ్యూరిటీపై లభించే వడ్డీ ఎంత? గరిష్ట పెట్టుబడి ఎంతవరకు పెట్టవచ్చు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

6 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ :
ఎస్బీఐ కస్టమర్ వయస్సు ఆధారంగా 6 నెలల ఎఫ్‌డీలపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ బ్యాంకు 60 ఏళ్లలోపు కస్టమర్లకు 5.65 శాతం, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి 6.15 శాతం అందిస్తుంది. సాధారణ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్లు 0.50శాతం అధిక వడ్డీని పొందవచ్చు. 80 ఏళ్లు లేదా ఆపై వయస్సు ఉన్న వ్యక్తులకు 6.25శాతం వడ్డీ రేటును అందిస్తారు.

211 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు :

SBI 3.05 శాతం నుంచి 7.15శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 211 రోజుల ఎఫ్‌డీల కోసం ఈ బ్యాంకు 5.90 శాతం నుంచి 6.50శాతం మధ్య రేట్లను అందిస్తుంది.

Read Also : Blue Aadhaar Card : బాల ఆధార్ ఏంటి? 5ఏళ్ల లోపు పిల్లలకు ఎలా తీసుకోవాలి? ఈ డాక్యుమెంట్లు మస్ట్..!

211 రోజుల ఎఫ్‌డీలపై గరిష్ట పెట్టుబడి :
211 రోజుల టెన్యూర్ FD ఖాతాల కోసం 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న కస్టమర్లకు ఎస్బీఐ 5.90శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 6.40శాతం పొందుతారు. అదనంగా, 80 ఏళ్లు పైబడిన కస్టమర్లు 6.50శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఈ FD పథకంలో గరిష్ట పెట్టుబడి రూ. 2,99,99,999 వరకు పెట్టవచ్చు.

వయోవృద్ధులకు వరం :
ఎస్‌బిఐ వయోవృద్ధులకు ఎఫ్‌డీలపై భారీ వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ కస్టమర్లకు అందించే వడ్డీ రేటు కన్నా 0.50శాతం అధికంగా అందిస్తుంది. అంతేకాదు.. ‘సూపర్ సీనియర్ సిటిజన్ల’కు అదనంగా 0.60శాతం వడ్డీని అందిస్తోంది.

రూ. 3 కోట్ల వరకు ఎఫ్‌డీలు:
ఈ వడ్డీ రేట్లు కేవలం రూ. 3 కోట్ల కన్నా తక్కువ ఉన్న FD డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఎఫ్‌డీ ఓపెన్ చేసేందుకు బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లను చెక్ చేయడం మంచిది. ఎందుకంటే.. బ్యాంకు వాటిని కాలానుగుణంగా సవరిస్తుంది.

డిసెంబర్ 2025 నుంచి FD రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. ఎస్బీఐ గత ఏడాది డిసెంబర్‌లో FD వడ్డీ రేట్లను చివరిసారిగా సవరించింది. అప్పటి నుంచి ఎస్బీఐ FD ఖాతాలపై అందించే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.