SBI vs PNB FD Rates : ఈ బ్యాంకుల్లో FD చేశారా? 2 ఏళ్ల FDపై ఎందులో రాబడి ఎక్కువంటే? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..!

SBI vs PNB FD Rates : మీరు మీ సేవింగ్స్ రెండేళ్ల FDలో పెట్టుబడి పెడితే SBI, PNB వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ముందే చెక్ చేసుకోండి. ఆ తర్వాతే మీకు ఏది బెటర్ అందులోనే FD చేయడం బెటర్..

SBI vs PNB FD Rates

  • ఎస్బీఐ, పీఎన్‌బీ FD కస్టమర్లకు పండగే
  • 2 ఏళ్ల ఎఫ్‌డీ ఖాతాలపై ఎందులో వడ్డీ ఎంతంటే?
  • ఏ వయస్సు వారికి ఎంతవరకు బెనిఫిట్స్ పొందొచ్చు

SBI vs PNB FD Rates : మీరు ఎఫ్‌డీలపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? మంచి రాబడిని పొందాలంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ల నుంచి సూపర్ సీనియర్ల వరకు అందరూ ఫిక్స్ డ్ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

దేశంలో రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లలో లక్షలాది  (SBI vs PNB FD Rates) మందికి ఎఫ్‌డీ ఖాతాలు ఉన్నాయి. మీరు రాబోయే రెండు ఏళ్ల పాటు మీ సేవింగ్స్ మొత్తాన్ని FDలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీ డబ్బుపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రాబడిని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

2 ఏళ్ల ఎఫ్‌డీపై SBI వడ్డీ ఎంతంటే? :

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు రెండేళ్ల ఎఫ్‌డీలపై 6.40శాతం నుంచి 7.05శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ ఎస్‌బీఐ బ్యాంకు 2 ఏళ్లు లేదా 24 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లందరికి 6.40శాతం వడ్డీని అందిస్తోంది.

60 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న కస్టమర్లకు రెండేళ్ల ఎఫ్‌డీ పథకాలపై 6.96శాతం వడ్డీని అందిస్తున్నాయి. అంతేకాదు.. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రెండేళ్ల ఎఫ్‌డీ ఖాతాలపై 7.05శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు కేవలం రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.

Read Also : Huawei Pura X View : స్టూడెంట్స్, గేమర్స్‌కి సూపర్ ఛాయిస్.. హువావే పురా ఎక్స్ వ్యూ వచ్చేసింది! ప్రీ-ఆర్డర్లు స్టార్ట్!

2 ఏళ్ల ఎఫ్‌డీపై PNB వడ్డీ ఎంతంటే? :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు 2 ఏళ్ల ఎఫ్‌డీలపై 6.30శాతం నుంచి 7.10శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 2 ఏళ్లు లేదా 24 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎఫ్‌డీ ఖాతాలపై 59 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కస్టమర్లందరికి పంజాబ్ బ్యాంక్ 6.30శాతం వడ్డీని అందిస్తోంది.

60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 2 ఏళ్ల ఎఫ్‌డీ పథకాలపై 6.30శాతం వడ్డీని అందిస్తోంది. అదనంగా, 80 ఏళ్లు లేదా ఆపై ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు 2 ఏళ్ల ఎఫ్‌డీ ఖాతాలపై 7.10శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.

ఏయే ఎఫ్‌డీలో బెనిఫిట్స్ ఎక్కువ? :
సాధారణ కస్టమర్లకు PNB కన్నా SBI వడ్డీ రేటు బెటర్. సూపర్ సీనియర్ సిటిజన్లకు పీఎన్‌బీలో 7.10శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ 7.05శాతం కన్నా కొద్దిగా ఎక్కువ. అందుకే ఎఫ్‌డీ చేసే ముందు మీ వయస్సు, పెట్టుబడి మొత్తం ఆధారంగా ఈ 2 బ్యాంకుల ప్రస్తుత రేట్లను కంపేర్ చేయడం మంచిది.

గత డిసెంబర్‌లో వడ్డీ రేట్లలో మార్పు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ పథకంలో వడ్డీ రేట్లను చివరిసారిగా డిసెంబర్ 2025లో సవరించింది. అప్పటి నుంచి ఎఫ్‌డీ ఖాతాలపై ఎస్బీఐ అందించే వడ్డీ రేట్లలో ఎలాంటి భారీ మార్పులు జరగలేదు.

Note : ఇది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ్ కాదు.. కేవలం సమాచారం మాత్రమే. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం బెటర్..