Ola Electric Refund : ఓలా ఎలక్ట్రిక్‌కు ఎదురుదెబ్బ.. వాళ్లందరికీ మొత్తం డబ్బులు వాపస్!
Ola Electric Refund : ఓలా S1 ఎక్స్ ప్లస్ స్కూటర్‌లో లోపాల కారణంగా వినియోగదారుల కమిషన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఫుల్ రిఫండ్ ఇవ్వాల్సిందిగా కంపెనీని ఆదేశించింది.
- Sreehari A
- Published on- June 16, 2026 / 08:36 PM IST
Ola Electric Refund
- ఆన్‌లైన్‌లో రూ. 89,999 ఆఫర్ చూసి కొనుగోలు
- ఓలా S1X ప్లస్ స్కూటర్ కొన్నాక లోపాలు వెలుగులోకి
- ఓలా ఎలక్ట్రిక్ కంపెనీపై కంజ్యూమర్ కోర్టులో వినియోగదారు ఫిర్యాదు
Ola Electric Refund : ఓలా ఎలక్ట్రిక్‌కు ఎదురుదెబ్బ తగిలింది.. ఓలా S1X ప్లస్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి డబ్బులు ఫుల్ వాపస్ ఇవ్వాల్సిందిగా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దాంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ సమస్యలు ఎదుర్కొన్న వారికి ఓలా కంపెనీ ఫుల్ రిఫండ్ చేయనుంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఫుల్ స్టోరీలోకి వెళ్దాం..
అహ్మదాబాద్‌లో ఓ ఫ్యామిలీ మంచి బ్రాండ్ కదా అని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నారు. అయితే అది (Ola Electric Refund) చివరికి కోర్టును ఆశ్రయించేవరకు వెళ్లింది. ఓలా ఎలక్ట్రిక్ విక్రయించిన S1X ప్లస్ స్కూటరే అసలు కారణం..
2024 జనవరిలో స్వాతి మఖిజా అనే ఫ్యామిలీ ఆన్‌లైన్‌లో రూ. 89,999 ఆఫర్ చూసి ఆకర్షితులయ్యారు. ఓలా షోరూమ్‌లో టెస్ట్ డ్రైవ్ చేశాక రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ కలిపి రూ. 1,02,687 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లారు. కొన్న రెండు రోజులకే ఓలా స్కూటర్ బ్యాక్ సైడ్ నుంచి సౌండ్ మొదలైంది.
Read Also : E100 vs Petrol : ఇథనాల్ పెట్రోల్ కన్నా చౌకే.. మైలేజీలో ఏది బెటర్? రూ.20 తక్కువ ధర నిజంగా లాభమా?
సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తే అక్కడ సమస్యను పరిష్కరించలేదు. బ్రేక్ ప్యాడ్‌ల ఇష్యూ కూడా ఫిక్స్ చేయలేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో డ్రైవింగ్ సమయంలో స్కూటర్ డిజిటల్ సిస్టమ్ ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది.
తమకు నాణ్యత లేని స్కూటర్ అంటగట్టారనే ఆగ్రహంతో బాధిత కుటుంబం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. అక్కడ వాదనలు, రికార్డులు, సర్వీస్ రిపోర్టులన్నీ పరిశీలించాక కమిషన్ కీలక తీర్పు చెప్పింది. కేవలం వాహనంలో చిన్న లోపం కాదనే సర్వీసులోనే లోపంగా కమిషన్ భావించింది.
కమిషన్ ఆదేశాల ప్రకారం.. :
కంపెనీ బాధిత వినియోగదారులకు పూర్తి మొత్తం రూ. 1,05,729 తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదనంగా 9శాతం వార్షిక వడ్డీ, మానసిక వేదనకు రూ. 40వేలు, న్యాయ ఖర్చులకు రూ. 10వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక్క ఫ్యామిలీ సమస్యగా కాదు.. దేశవ్యాప్తంగా పెరిగే వివాదాల లిస్ట్‌లో ఇదొకటిగా మారింది.
