Silver Crash : వెండి భారీ పతనం.. ఏకంగా రూ. 2 లక్షల డ్రాప్! ఇప్పుడు కొనాలా..? పెట్టుబడి పెట్టాలా?

Silver Crash : వెండి భారీగా పతనమైంది. గరిష్ట స్థాయి నుంచి రూ. 2 లక్షలు (దాదాపు 40 శాతం) పడిపోయింది. పెట్టుబడిదారులలో ఆందోళనలను పెంచింది. ఈ పతనానికి కారణాలు, భవిష్యత్ ధోరణులు, ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా? లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

Silver Crash

  • భారీగా క్షీణించిన వెండి ధరలు
  • 2026లో గరిష్ట స్థాయి నుంచి ఏకంగా రూ. 2 లక్షలకు పైగా పతనం
  • వెండి ధరల పతనానికి అసలు కారణాలివే

Silver Crash : వెండి ఒక్కసారిగా పతనమైంది. 2026లో గరిష్ట స్థాయి నుంచి వెండి ధర అమాంతం రూ. 2 లక్షలకు పడిపోయింది. మొన్నటివరకూ మార్కెట్లో దూసుకుపోయినా వెండి ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో పెట్టుబడిదారులు షాకవుతున్నారు.

భవిష్యత్తులో ఏమి జరగబోతుందోనని ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. 2025లో అత్యంత వేగంగా దూసుకెళ్లిన వెండి (Silver Crash) దాదాపు 170 శాతం రాబడిని అందించింది. ఆ తర్వాత జనవరి 2026లో మరో 74 శాతం వెండి పెరిగింది.

జనవరి 2026లో MCXలో కిలోకు సుమారు రూ. 4,04,500 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెండి ప్రస్తుతం 2025 ముగింపు స్థాయి రూ. 2.41 లక్షల కన్నా తక్కువ ధరకు ట్రేడవుతోంది. అంటే.. ఈ ఏడాది వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

అంతేకాదు.. వెండి గరిష్ఠ స్థాయి నుంచి 40శాతానికి (రూ. 2 లక్షలు) పైగా పడిపోయింది. మంగళవారం రోజు కిలో వెండి ధర సుమారు రూ. 2.36 లక్షలుగా ఉంది. ఈ పతనం పాత, కొత్త పెట్టుబడిదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో చాలామంది తమ వాటాలను తగ్గించుకుని, సురక్షితమైన మార్గాల వైపు మళ్లుతున్నారు.

ఈ క్షీణతకు అసలు కారణం ఇదే :
వెండి ధర ఇటీవలి క్షీణతకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద కారణం అమెరికా డాలర్ బలంగా ఉండటమే. డాలర్ బలపడినప్పుడు, ఇతర దేశాలకు వెండి ఖరీదైపోయి గిరాకీ తగ్గుతుంది. అదనంగా, వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు రాబడినిచ్చే ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. వెండి అలాంటి ఆస్తి కాదు. అందుకే వెండిపై పెట్టుబడి తగ్గుతోంది. మూడో ప్రధాన కారణం లాభాల స్వీకరణ. సుదీర్ఘ ర్యాలీ తర్వాత, పెట్టుబడిదారులు లాభాలను పొందుతున్నారు. దాంతో వెండి పతనాన్ని మరింత పెంచింది.

Read Also : Summer AC Tips : ఈ వేసవిలో AC తెగ వాడేస్తున్నారా? మీ ఏసీ ఏ క్షణమైనా పేలొచ్చు జాగ్రత్త.. ఎలా నివారించాలంటే? ఫుల్ డిటెయిల్స్

వెండి కేవలం పెట్టుబడికి మాత్రమే కాదు.. భారీ పారిశ్రామిక వినియోగం కూడా ఉంది. మొత్తం వెండి వినియోగంలో 60 శాతానికి పైగా వాటా వెండిదే. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెళ్లు, ఇతర పరిశ్రమలలో పెరుగుతున్న డిమాండ్ దీర్ఘకాలంలో వెండి ధరకు కారణమవుతుంది.

వెండి ధరల ప్రభావానికి ఇతర కారకాలు ఏంటి? :
పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. బంగారం, వెండిపై ఈసారి అమ్మకాలు భారీగా జరిగాయి.పెరుగుతున్న ముడి చమురు ధరలు అధికమవుతున్న అనిశ్చితి కారణంగా, పెట్టుబడిదారులు బంగారం, వెండిని సురక్షితమైనవిగా భావిస్తున్నారు. అంతేకాకుండా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బలమైన డాలర్ కూడా వెండి ధరలను పెంచుతున్నాయి.

మీరు ఇప్పుడే వెండి కొనాలా? :
టాటా మ్యూచువల్ ఫండ్ రిపోర్టు ప్రకారం.. వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా అవకాశం ఉంది. డాలర్ బలపడటం వల్ల గానీ, ఉద్రిక్తతలు తగ్గడం వల్ల గానీ ధరలు తగ్గితే వెండి కొనుగోలుకు అద్భుతమైన అవకాశం. సుదీర్ఘ ర్యాలీ తర్వాత ఇలాంటి తగ్గుదలలు సాధారణమే.

ధర తగ్గినప్పుడు కొనుగోలు వ్యూహం :
అధిక స్థాయిలలో కొనుగోలు చేయడం కన్నా ధరలు తగ్గినప్పుడు కొనడం అనే వ్యూహాన్ని అనుసరించాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడిదారులకు సిఫార్సు చేస్తోంది. ఇటీవలి ర్యాలీ తర్వాత స్వల్పకాలంలో ధరలు స్థిరపడవచ్చు లేదా కొద్దిగా తగ్గవచ్చు.

బ్రోకరేజ్ సంస్థ ప్రకారం.. పెట్టుబడిదారులు బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్‌లు లేదా ఫిజికల్ బులియన్ వంటి అనేక మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

సాంకేతిక పరంగా చూస్తే.. :
ప్రస్తుతం MCX సిల్వర్ రూ. 245,200 వద్ద ట్రేడవుతోంది. రూ. 244,400 నిరోధక స్థాయిని అధిగమించింది. తదుపరి నిరోధక స్థాయి ఇప్పుడు రూ. 246,000 వద్ద ఉంది. ఈ స్థాయిని దాటితే వెండి ధర రూ. 247,000 నుంచి రూ. 248,000 లాభాల వైపు కదలవచ్చు.