Simple Ultra EV Scooter : సింపుల్ అల్ట్రా EV స్కూటర్ కిర్రాక్ భయ్యా.. సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
Simple Ultra EV Scooter : సింపుల్ అల్ట్రా ఈవీ స్కూటర్ అడ్వాన్స్ టెక్నాలజీతో 4 లెవల్స్ ట్రాక్షన్ కంట్రోల్ అందిస్తుంది. తడి లేదా జారే రోడ్లపై స్కూటర్ జారిపోకుండా కంట్రోల్ చేస్తుంది. డాష్‌బోర్డ్‌లో భారీ 7-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్ కూడా ఉంది.
- Sreehari A
- Published on- April 18, 2026 / 04:06 PM IST
Simple Ultra Electric Scooter (
- సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 2.35 లక్షలకే
- సింగిల్ ఛార్జ్ చేస్తే 400 కి.మీ రేంజ్ దూసుకెళ్లగలదు
- ల్ ఛార్జ్ చేస్తే బెంగళూరు నుంచి చెన్నైకు వెళ్లొచ్చు
Simple Ultra EV Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ సింపుల్ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. భారీ రేంజ్ అందించే అల్ట్రా మోడల్ మార్కెట్లోకి దించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉంది.
ఇప్పటికే, రిటైల్ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ కొత్త లాంగ్-రేంజ్ ఈవీ స్కూటర్ కూడా ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారుగా రూ.2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ 6.5kWh బ్యాటరీ వెరీ స్పెషల్. 400 కిలోమీటర్ల (IDC) రేంజ్ అందిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే బెంగళూరు నుంచి చెన్నైకు వెళ్లొచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమయ్యే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా చాలా ఎక్కువ.
Read Also : Smartphones Prices : మీ ఫేవరెట్ ఫోన్ ధర పెరిగిందా? భారత్‌లో 80 మోడళ్లపై భారీ పెంపు.. ఇంకా పెరగనున్న ధరలు!
టాప్ రేంజ్ గంటకు 115 కి.మీ :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం స్పీడ్ రేంజ్‌లోనే కాదు.. పర్ఫార్మెన్స్ కూడా దుమ్మురేపుతోంది. ఈ సింపుల్ ఈవీ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 115 కిలోమీటర్లు అందిస్తుంది. జస్ట్ 2.77 సెకన్లలో 0 నుంచి గంటకు 40కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. సింపుల్ వన్ తర్వాత రెండో స్కూటర్ ఇదే.
స్మార్ట్ ఫీచర్లు, కంట్రోలింగ్ ఫీచర్లు :
ఈ సింపుల్ ఈవీ కంపెనీ సేఫ్టీ, సౌలభ్యం కోసం అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తోంది. ఇందులో ఫోర్ లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. తడి, జారే రోడ్లపై స్కూటర్ జారిపోకుండా కంట్రోల్ చేస్తుంది. డాష్‌బోర్డ్‌లో భారీ 7-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్ ఉంది. మీరు నావిగేషన్, రైడ్ మోడ్‌లు, బ్యాటరీ డేటాను చూడవచ్చు.
ఎక్కడ? ఎలా కొనాలి? :
ఈవీ స్కూటర్ డీలర్ నెట్‌వర్క్ ద్వారా టెస్ట్ రైడ్ చేయొచ్చు. మీకు దగ్గరలోని సింపుల్ స్టోర్ విజిట్ చేయడం లేదా కంపెనీ వెబ్‌సైట్ (simpleenergy.in)లో నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా సిటీల్లో 70కి పైగా టచ్‌పాయింట్‌లతో అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో రాంచీ, భువనేశ్వర్ నాగ్‌పూర్ నగరాల్లో కూడా షోరూమ్‌లను ప్రారంభించనుంది.
