Smart TV Buying Guide : కొత్త స్మార్ట్‌టీవీ కొనేముందు ఈ మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే భారీగా నష్టపోతారు.. అవేంటో తెలుసా?
Smart TV Buying Guide: చాలా మంది స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను పట్టించుకోరు. ఆ తర్వాత బాధపడిపోతుంటారు. మీరు కొత్త టీవీ కొనాలని అనుకుంటే ఈ విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి.
- Sreehari A
- Updated on- May 14, 2026 / 08:34 PM IST
Smart TV Buying Guide ( Illustration generated using AI )
- కొత్త స్మార్ట్ టీవీ కొనేముందు ఈ పొరపాట్లు అసలు చేయొద్దు
- స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఆ తర్వాత బాధపడినా నో యూజ్
- ఈ ఫీచర్ల విషయంలో అసలు రాజీ పడొద్దు.. అవేంటంటే?
Smart TV Buying Guide: కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మార్కెట్లో ఏదైనా టీవీ కొనే ముందు చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత తెగ బాధపడిపోతుంటారు. గత కొన్నేళ్లుగా భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు పాపులారిటీ బాగా పెరిగింది.
చైనీస్ బ్రాండ్‌ల ఎంట్రీతో టీవీల ధరలు కూడా బడ్జెట్ రేంజ్ లోకి వచ్చాయి. స్మార్ట్ టీవీని కొనేటప్పుడు భారతీయ యూజర్లు ముందుగా ధర, ఆ తర్వాత బ్రాండ్ చూస్తుంటారు. అయితే, ఈ హడావిడిలో స్మార్ట్ టీవీ ముఖ్యమైన ఫీచర్లను పట్టించుకోరు. మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తుంటే ఈ పొరపాట్లు చేయకుండి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
స్క్రీన్ సైజు విషయంలో జాగ్రత్త :
స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు తరచుగా స్క్రీన్ సైజును పట్టించుకోరు. ఎల్లప్పుడూ రూమ్ సైజ్ బట్టి టీవీని ఎంచుకోండి. టీవీ స్క్రీన్ సైజు పెద్దగా ఉండి గదికి సరిపోకపోతే మీ డబ్బును వృధా చేసుకున్నట్లే. అదే సమయంలో భారీ హాలులో చిన్న స్క్రీన్ సైజు ఉన్న టీవీని అమర్చడం ఇబ్బందికరంగా ఉంటుంది.
పిక్చర్ క్వాలిటీని లైట్ తీసుకోవద్దు :
కొత్త స్మార్ట్ టీవీని కొనేటప్పుడు చాలామంది ఫొటో క్వాలిటీని పెద్దగా పట్టించుకోరు. ఈ రోజుల్లో, HD, HD+, UHD, 4K, 8K రిజల్యూషన్‌లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. LED, OLED, QLED, MiniLED స్మార్ట్ టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్క్రీన్ రిజల్యూషన్‌లు, క్వాలిటీతో టీవీల ధరలలో భారీగా వ్యత్యాసం ఉంటుంది. అందుకే తరచుగా తక్కువ ధరలకు భారీ స్క్రీన్ టీవీలు కొనుగోలు చేస్తారు.
Read Also : Post Office FD : పోస్టాఫీసు FDలో రూ. 2 లక్షలు పెడితే 3 ఏళ్లకు ఎంత వడ్డీ వస్తుంది? పూర్తి లెక్క ఇదే!
ఆపరేటింగ్ సిస్టమ్ :
దేశీయ మార్కెట్లో లభించే స్మార్ట్ టీవీలు గూగుల్ టీవీ (ఆండ్రాయిడ్ టీవీ), వెబ్‌ఓఎస్, టైజెన్‌ఓఎస్, లేదా ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై ఆధారపడి పనిచేస్తాయి. ఈ రోజుల్లో కొన్ని స్మార్ట్ టీవీలు జియో టెలి ఓఎస్‌తో కూడా వస్తున్నాయి.
ఎల్‌జీ టీవీలు వెబ్‌ఓఎస్‌పై, శాంసంగ్ టీవీలు టైజెన్ వన్‌యూఐ ఓఎస్‌పై రన్ అవుతాయి. ఇతర బ్రాండ్‌ల టీవీలు ఆండ్రాయిడ్ లేదా గూగుల్ టీవీపై పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ టీవీ మీకు వైడ్ రేంజ్ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ ఇస్తుంది. అంతేకాదు.. ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేయొచ్చు.
కనెక్టివిటీ కూడా అవసరమే :
స్మార్ట్ టీవీ స్మార్ట్‌గా ఉండాలంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ముఖ్యం. మీ స్మార్ట్ టీవీలో Wi-Fi, బ్లూటూత్, USB, ఆప్టికల్, LAN, లేదా HDMI వంటి పోర్ట్‌లలో ఏవైనా లేకపోతే మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందలేరు. ఓటీటీ మూవీలు ఇలా ఏదైనా చూడలేరు.
సౌండ్ సిస్టమ్ :
స్మార్ట్ టీవీకి పిక్చర్ క్వాలిటీ, ఆపరేటింగ్ సిస్టమ్, కనెక్టివిటీ ఉన్నా మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఉండాలి. మీరు స్మార్ట్ టీవీని కొనే ముందు సౌండ్ సిస్టమ్ కూడా జాగ్రత్తగా చెక్ చేయండి. లేదంటే ఆ తర్వాత బాధపడినా ఫలితం ఉండదు.
