Split AC Offers : బాబోయ్.. ఏంటి ఎండలు.. ఈ టాప్ బ్రాండ్ ఏసీలపై దుమ్మురేపే డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

Split AC Offers : ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? టాప్ బ్రాండ్ స్ప్లిట్ ఏసీల ధరలు భారీగా తగ్గాయి. ఓసారి లుక్కేయండి.

Split AC Offers : బాబోయ్.. ఏంటి ఎండలు.. ఈ టాప్ బ్రాండ్ ఏసీలపై దుమ్మురేపే డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

Split AC Offers

Updated On : May 21, 2025 / 11:33 AM IST

Split AC Offers : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే ఇంట్లో ఏసీ, కూలర్లలో (Split AC Offers) ఏదో ఒకటి కచ్చితంగా ఉండాల్సిందే.

మీరు ఈ సమ్మర్‌లో కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్‌కార్ట్ టాప్ బ్రాండ్ ఏసీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Read Also :  Android 16 Beta : ఆండ్రాయిడ్ 16 బీటా రిలీజ్.. సపోర్టు చేసే ఫోన్లు ఇవే.. మీ ఫోన్‌కు వచ్చిందా? చెక్ చేసుకోండి..!

టీసీఎల్, వనిడా, లాయిడ్, ఏసర్ వంటి బ్రాండ్లలో 1.5-టన్ స్ప్లిట్ ఏసీలను తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

టీసీఎల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
టీసీఎల్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ రూ. 30వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ కోసం 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఏసీలో టూ వే ఎయిర్ ప్లో, ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి.

ఒనిడా 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఒనిడా కంపెనీ కేవలం రూ.27,490కే 1.5 టన్ స్ప్లిట్ ఏసీ అందిస్తోంది. ఈ యూనిట్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌తో వస్తుంది. 55 డిగ్రీల సెల్సియస్ వరకు పనిచేస్తుంది. ఏసీ బడ్జెట్-ఫ్రెండ్లీ ధర రూ. 27,490కు లభ్యమవుతుంది.

లాయిడ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
లాయిడ్స్ 1.5-టన్ను ఏసీ సరసమైన ధరకే లభిస్తోంది. 48 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ కలిగి ఉంది. బయటి ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌ దాటినా కూలింగ్ అందిస్తుంది. ఈ ఏసీ ధర భారత మార్కెట్లో రూ. 28,990 నుంచి అందుబాటులో ఉంది.

ఏసర్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
టెక్ బ్రాండ్ ఏసర్ పవర్‌ఫుల్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. 5050W కూలింగ్ కెపాసిటీ అందిస్తుంది. ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్‌తో ఈ ఏసీ రూ.29,990కు లభ్యమవుతుంది.

Read Also : Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్‌కు పండగే.. ఈ 4 ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ఖర్చుతో కొత్త ఎయిర్ కండీషనర్ల డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా పొందవచ్చు.