Android 16 Beta : ఆండ్రాయిడ్ 16 బీటా రిలీజ్.. సపోర్టు చేసే ఫోన్లు ఇవే.. మీ ఫోన్‌కు వచ్చిందా? చెక్ చేసుకోండి..!
Android 16 Beta : ఆండ్రాయిడ్ 16 బీటా కొత్త అప్‌డేట్ రిలీజ్ అయింది. సపోర్టు చేసే పిక్సెల్ ఫోన్లలో ఈ కొత్త బీటా వెర్షన్ అందుబాటులో ఉంది.

Android 16 Beta
Android 16 Beta : గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆండ్రాయిడ్ 16 బీటా వెర్షన్ రిలీజ్ అయింది. ఆండ్రాయిడ్ 16 QPR1 బీటా 1 పేరుతో కొత్త అప్‌డేట్ విడుదల చేసింది.
ఈ కొత్త బీటా వెర్షన్ మెటీరియల్ 2 ఎక్స్ ప్రెసివ్ రీడిజైన్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంది. ఈ అప్‌డేట్ నోటిఫికేషన్ షేడ్, క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్, లాక్ స్క్రీన్, లాంచర్ కోసం కొత్త డిజైన్ అందిస్తోంది.
ముఖ్యంగా పిక్సెల్ అభిమానులు ఈ కొత్త అప్‌డేట్ అందుకోనున్నారు. పిక్సెల్ 9లో అప్‌డేట్ సైజు దాదాపు 574MB ఉంటుందని నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్ 16 బీటా వెర్షన్ అప్‌డేట్ అందుకున్న పిక్సెల్ యూజర్లు కొన్ని బగ్స్, పర్ఫార్మెన్స్ పరంగా ఇష్యూ ఉండొచ్చు.
ఆండ్రాయిడ్ 16 బీటా ఎలా? :
ఆండ్రాయిడ్ 16 బీటాకు అర్హత కలిగిన అన్ని డివైజ్‌ల్లో అందుబాటులో ఉంటుంది. మీకు ఈ కొత్త అప్‌డేట్ వచ్చిందో లేదో తెలియాలంటే ఆండ్రాయిడ్ బీటా పోర్టల్‌కి వెళ్లండి. గూగుల్ మీ డివైజ్‌కు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ను అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 16 బీటా (Android 16 Beta) సపోర్టు చేసే పిక్సెల్ ఫోన్లు ఇవే :
- Pixel 6
- Pixel 6 Pro
- Pixel 6a
- Pixel 7
- Pixel 7 Pro
- Pixel 7a
- Pixel Fold
- Pixel Tablet
- Pixel 8
- Pixel 8 Pro
- Pixel 8a
- Pixel 9
- Pixel 9 Pro
- Pixel 9 Pro XL
- Pixel 9 Pro Fold
- Pixel 9a
ఆండ్రాయిడ్ 16 కీలక డిజైన్ ఫీచర్లు :
ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్ యాప్స్ లేదా నోటిఫికేషన్ లేకుండా డైనమిక్‌గా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ కొంచెం బ్లర్ ఉంటుంది. నోటిఫికేషన్ షేడ్ ఉన్న చోట ఇలా కనిపిస్తుంది. కలర్ థీమ్స్, టైపోగ్రఫీతో నేచురల్ యానిమేషన్ వంటి అప్‌డేట్స్ అందిస్తుంది.
Read Also : Moto G85 5G : వండర్‌ఫుల్ డిస్కౌంట్.. మోటో G85 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి!
డిజైన్ అప్‌గ్రేడ్‌లో హోమ్ స్క్రీన్ ఐకాన్స్, విడ్జెట్ క్విక్ సెట్టింగ్‌లలో మరిన్ని కస్టమైజడ్ ఆప్షన్లు ఉన్నాయి. యాప్స్ నుంచి రియల్ టైమ్ డేటాను అందించే కొత్త లైవ్ అప్‌డేట్ ఫీచర్ కూడా ఉన్నాయి.